దాదాపు ఏడేళ్ల పాటు వీరిద్దరూ డేటింగ్ చేసి చివరకు మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఇక నయనతారకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హీరోలతో సమానమైన ఇమేజ్ సంపాదించుకుంది. ఇప్పటికే తెలుగు, తమిళ్ సినిమాల్లో సత్తా చాటిన నయన్.. తాజాగా బాలీవుడ్లో కూడా తన పవర్ చూపించేందుకు సిద్దమవుతోంది.
పెళ్లి జరుగుతున్న సమయంలో తిరిగి నయనతార సినిమాలలో నటించాలని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఒకవేళ నటించిన ఈమె కండిషన్లకు నిర్మాతలు ఒప్పుకుంటేనే సినిమాల్లో నటిస్తుందని వార్తలు వచ్చాయి.అలాంటి రూమర్స్‌ను బ్రేక్ చేస్తూ.. పెళ్లైన వెంటనే నయన్ ఏకంగా బాలీవుడ్ సినిమాలో భారీగా రెమ్యునరేషన్ తీసుకొని చేస్తుండటం విశేషం.