Nayanthara - Mehreen pirzada : మెహ్రీన్.. తెలుగులో నాని హీరోగా వచ్చిన 'కృష్ణగాడి వీరప్రేమగాధ' సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. హను రాఘవపుడి దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఈమె తాజాగా దుబాయ్‌లో నయనతారతో కలిసి దిగిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేసింది. (Instagram/Photo)
అంతే కాకుండా మెహ్రీన్‌కు మంచి నటి అని పేరు తీసుకొచ్చింది. ఆ సినిమా హిట్ తర్వాత కొంత గ్యాప్ తీసుకొని మారుతి దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా వచ్చిన 'మహానుభావుడు' సినిమా చేసింది. ఈ సినిమా కూడా ప్రేక్షకుల్నీ భాగానే అలరించింది. ఆ తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన 'ఎఫ్2' మూవీతో మరో హిట్ అందుకుంది. (Instagram//Photo)
లేడీ సూపర్ స్టార్ నయనతార తెలుగులో విక్టరీ వెంకటేష్, వినాయక్ కాంబినేషన్లో వచ్చిన 'లక్ష్మీ' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత వరుసగా తెలుగు, తమిళ భాషల్లో టాప్ హీరోల సరసన నటిస్తూనే.. మరోవైపు తనకు మాత్రమే సాధ్యమయ్యే లేడి ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నారు. అంతకు ముందు ఈమె చంద్రముఖితో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది. Photo :Twitter
మెహ్రీన్ కౌర్.. రీసెంట్గా ‘మంచి రోజులు వచ్చాయి’ సినిమలో నటించింది. మరోవైపు అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటిస్తోన్న ‘ఎఫ్ 3’ మూవీలో నటిస్తోంది. ఈ చిత్రం ఏప్రిల్ 29న విడుదల కానుంది. ఈ మూవీ విజయం ఈ భామకు చాలా కీలకం. ఈ సినిమా పై టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో భారీ అంచనాలే ఉన్నాయి. (Twitter/Photo)
మెహ్రీన్ కౌర్ 5 నవంబర్ 1993లో రాష్ట్రంలోని భటిండాలో జన్మించింది. ఈమె తమ్ముడు కూడా మోడల్ నటుడు. అంతేకాదు చిన్నపుడే మోడలింగ్‌లో అడుగుపెట్టిన ఈమె ఆ తర్వాత నటిగా మారింది. మెహ్రీన్ కౌర్ తెలుగుతో పాటు తమిళ, హిందీ, పంజాబీ సినిమాలలో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక సోషల్ మీడియాలో మాత్రం నిత్యం ఫోటోలను బాగా పంచుకుంటుంది. (Instagram/Photo)