లేడీ సూపర్ స్టార్ నయనతార ఇటీవల తన ప్రియుడిని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. విఘ్నేష్ శివన్‌తో ఉన్న తన నాలుగు సంవత్సరాల ప్రేమ బంధాన్ని పెళ్లి బంధంతో ముగించారు. ఇక ఈ జంట రీసెంట్గా థాయ్ లాండ్కు హనీమూన్‌కు కూడా వెళ్లిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన కొన్ని పిక్స్ ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక అది అలా ఉంటే నయన్ అప్పుడే భర్తకు బై బై చెప్పి.. షూటింగ్‌లకు మళ్ళీ సిద్దం అయ్యింది. నయనతార ప్రస్తుతం తెలుగులో చిరంజీవి గాడా ఫాదర్‌తో పాటు హిందీలో అట్లీ దర్శకత్వంలో వస్తున్న షారుఖ్ ఖాన్ 'జవాన్'లో కీలకపాత్రలో నటిస్తున్నారు. Photo : Twitter
యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించి ఇటీవల వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ మంచి ఆదరణ పొందాయి. దీపికా పడుకోనే హీరోయిన్గా నటిస్తున్నారు. ఇతర కీలకపాత్రల్లో ప్రియమణి, సాన్యా మల్హోత్రా, సునీల్ గ్రోవర్ కనిపించనున్నారు. ఈ సినిమాలో షారుఖ్ ఖాన్ తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తారని టాక్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతుండగా.. నయనతార హాజరైన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇక్కడే నయన్ కొన్ని రోజుల పాటు ఉండి తన షూటింగ్ పార్ట్‌ను ముగించుకుని చెన్నై వెళ్తారట. జవాన్ చిత్రాన్ని హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో వచ్చే సంవత్సరం జూన్ 2న విడుదల చేస్తున్నారు. Photo : Twitter
ఇక ఆమె సినిమాల విషయానికి వస్తే.. నయన్ నటించిన తాజా సినిమా కాతు వాకుల రెండు కాదల్ (Kaathu Vaakula Rendu Kaadhal). ఈ సినిమాకు విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి హీరోగా నటించారు. సమంత మరో హీరోయిన్గా చేశారు. ఈ చిత్రం ఏప్రిల్ 28న విడుదలై హిట్ టాక్‌ను తెచ్చుకుంది. ప్రస్తుతం హాట్ స్టార్‌లో స్ట్రీమ్ అవుతోంది. అనిరుధ్ సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని తెలుగులో కణ్మణి రాంబో ఖతీజాగా డబ్ చేశారు. ఇక్కడ ఓకే అనిపించుకుంది. నయన్ మరో సినిమా 02. ఈ సినిమా డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదలై పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. Photo : Twitter
ఇక నయనతార ప్రస్తుతం చిరంజీవి హీరోగా వస్తోన్న గాడ్ ఫాదర్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా మలయాళీ హిట్ సినిమా లూసిఫర్‌కు తెలుగు రీమేక్‌గా వస్తోంది. మోహన్ రాజా దర్శకుడు. సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇక లేడీ సూపర్ స్టార్ నయనతార విషయానికి వస్తే.. తెలుగులో ఆమె విక్టరీ వెంకటేష్, వినాయక్ కాంబినేషన్లో వచ్చిన 'లక్ష్మీ' సినిమాలో నటించి టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత వరుసగా తెలుగు, తమిళ భాషాల్లో టాప్ హీరోల సరసన నటిస్తూనే.. మరోవైపు తనకు మాత్రమే సాధ్యమయ్యే లేడి ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నారు. Photo : Twitter
అందులో భాగంగా నయనతార తమిళ్లో 'అరం', 'డోరా', 'కోలమావు కోకిల', 'ఐరా', 'కొలైయుదిర్‌కాలం'... వంటి హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించి తనకంటూ ఓ గుర్తింపును, ఇండస్ట్రీలో ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. అది అలా ఉంటే తాజాగా ఆమె మరో బిజినెస్ లోకి అడుగుపెట్టిందని తెలుస్తోంది. బ్యూటీ ప్రాడక్ట్స్ బిజినెస్ ను ప్రారంభించింది నయనతార. ఆమె 'ది లిప్ బామ్ కంపెనీ' పేరుతో రీటైల్ బ్రాండ్ ను లాంచ్ చేసింది. చర్మవ్యాధి నిపుణురాలు రేణిత రాజన్ తో కలిసి ఈ బిజినెస్ ను ఆమె ప్రారంభించింది. Photo : Twitter
లేడి సూపర్ స్టార్ నయనతార, దక్షిణాదిలోని నాలుగు భాషల్లోనూ నటిస్తోన్న నటి. అయితే చాలా కాలం తర్వాత ఆమె తెలుగులో చిరంజీవి 'సైరా నరసింహారెడ్డి'లో కథానాయికగా నటించింది. ఈ సినిమాను దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కించారు. నయనతార మరోవైపు తమిళంలో ఇటూ హీరోయిన్గా చేస్తూనే మరో పక్క లేడీ ఓరియంటెడ్ సినిమాలతో దుమ్ము దులుపుతున్నారు. తాజాగా ఆమె నెట్రికన్ అనే సినిమాలో నటించారు. Photo : Twitter
ఇక నయనతార నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే.. ఆమె నటించిన నెట్రికన్ ఇటీవలే హాట్ స్టార్ విడుదలై (Netrikann on Hotstar)అదరగొట్టింది. ఈ చిత్రాన్ని ఆమె భర్త, ప్రముఖ దర్శకుడు విఘ్నేశ్ శివన్ నిర్మించారు. 'గృహం' ఫేమ్ మిలింద్ రావ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో నయనతార అంధురాలి పాత్రలో కనిపించి తన నటనతో అదరగొట్టింది. కంటి చూపు లేని యువతి తన వినికిడి శక్తిని ఉపయోగించి సైకో కిల్లర్ ను ఎలా పట్టుకుంది అనేదే కథ. ‘గృహం’ చిత్ర దర్శకుడు మిలింద్ రావ్ ఈ సినిమాకు దర్శకుడు. కొరియన్ చిత్రం ‘బ్లైండ్’కు రీమేక్‌గా వచ్చింది. Photo: Twitter