నయనతార, దక్షిణాదిలోని నాలుగు భాషల్లోనూ నటిస్తోన్న నటి. అయితే తెలుగులో చాలా కాలం తర్వాత ఆమె ప్రస్తుతం చిరంజీవి హీరోగా నటిస్తోన్న 'సైరా నరసింహారెడ్డి'లో కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాను దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్నారు. నయనతార మరోవైపు తమిళంలో ఇటూ హీరోయిన్గా చేస్తూనే మరో పక్క లేడీ ఓరియంటెడ్ సినిమాలతో దుమ్ము దులుపుతోంది.
దక్షిణాది సినిమా హీరోయిన్లలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సాధించారు నయనతారు. ఆమె అసలుపేరు డయానా మరియా కురియన్. (Photo: instagram)
40/ 54
కేరళకు చెందిన నయనతార, గత 15 ఏళ్లుగా దక్షిణాదిలోని పలు సినిమాల్లో నటించింది. 2003లో విడుదలైన మలయాళ చిత్రం ‘మనస్సినక్కరే’తో నయనతార తెరంగేట్రం చేసింది.
41/ 54
2005లో ‘అయ్యా’ చిత్రంలో శరద్ కుమార్ సరసన నటించిన నయనతార, ఆ చిత్రంతో తమిళ ప్రేక్షకులకు పరిచయమయ్యింది.
42/ 54
తమిళ్లో నయనతార నటించిన రెండో చిత్రం ‘చంద్రముఖి’. ఈ చిత్రంలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన నటించడంతో ఆమెకు దక్షిణాది వ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చింది.
43/ 54
2006లో ‘లక్ష్మి’ చిత్రంతో టాలీవుడ్లో అరంగేట్రం చేసింది నయనతార. అదే సంవత్సరం తెలుగులో మరో చిత్రం ‘బాస్’లోనూ నటించింది.
44/ 54
2011లో ‘శ్రీరామ రాజ్యం’ చిత్రంలో సీతపాత్రలో నయనతార తెలుగు ప్రేక్షకులను మెప్పించారు. దీనికి నయనతారకు ఫిల్మ్ ఫేర్ అవార్డు కూడా దక్కింది. ‘కృష్ణం వందే జగద్గురుం’(2012) కూడా నయనతారకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.
45/ 54
2015లో ఆమె నటించిన అన్ని సినిమాలు హిట్ సాధించడంతో కోలీవుడ్‌లో ఆమెను ‘లేడీ సూపర్ స్టార్’గా మెప్పు పొందింది.
46/ 54
వెరైటీ రోల్స్ చేస్తూ దూసుకెళ్తున్న నయనతారకు పలు అవార్డులు దక్కాయి. శ్రీరామ రాజ్యం చిత్రంతో పాటు మరో నాలుగు తమిళ చిత్రాలకు నయనతార ఫిల్మ్ ఫేర్ అవార్డులు సాధించింది.
47/ 54
‘ది గ్లామర్ క్వీన్ ఆఫ్ తమిళ్ సినిమా’గా ప్రశంసలు అందుకుంది నయనతార.
48/ 54
‘అదుర్స్’, ‘సింహా’ తదితర చిత్రాలు కూడా తెలుగులో ఆమెకు మంచి పేరు సాధించిపెట్టాయి.
49/ 54
2010లో ‘సూపర్’ చిత్రంతో కన్నడ ప్రేక్షకులకు కూడా పరిచయమైయ్యింది నయనతార. దక్షిణాదిలోని అన్ని భాషలు మలయాళం, తమిళ్, తెలుగు, కన్నడలో నటించిన నటిగా గుర్తింపు సాధించింది.
50/ 54
శ్రీరామ రాజ్యం(2011) చిత్రానికి గాను ‘ఉత్తమ నట’ కేటగిరీలో నంది అవార్డుకు నయనతార ఎంపికయ్యింది.
51/ 54
బోల్డ్ రోల్స్‌తో పాటు నటనకు అవకాశమున్న పలు పాత్రల్లో నటించి మెప్పించింది నయనతార