నయనతారలో అంతకంతకు పెరుగుతున్న టెన్షన్... అదే కారణం
నయనతారలో అంతకంతకు పెరుగుతున్న టెన్షన్... అదే కారణం
రజినీకాంత్ నయా మూవీ దర్బార్... మరికొద్ది గంటల్లోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాపై రజినీకాంత్ అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కొన్నేళ్లుగా సరైన హిట్ లేని సూపర్ స్టార్... ఈ సినిమాతో మరోసారి తన రేంజ్ ఏంటో చాటి చెబుతారని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఇదిలా ఉంటే గతేడాది సినిమాలు రావడం తప్పితే... సక్సెస్‌లు లేని నయనతారకు కూడా దర్బార్ ఎంతో కీలకంగా మారింది. ఈ సినిమా హిట్టయితేనే టాప్ హీరోయిన్గా, ఎక్కువగా రెమ్యూనరేషన్ తీసుకునే హీరోయిన్గా నయన్ రేంజ్ కొనసాగుతుందనే టాక్ కోలీవుడ్‌లో గట్టిగా వినిపిస్తోంది.
దక్షిణాది సినిమా హీరోయిన్లలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సాధించారు నయనతారు. ఆమె అసలుపేరు డయానా మరియా కురియన్. (Photo: instagram)
67/ 81
కేరళకు చెందిన నయనతార, గత 15 ఏళ్లుగా దక్షిణాదిలోని పలు సినిమాల్లో నటించింది. 2003లో విడుదలైన మలయాళ చిత్రం ‘మనస్సినక్కరే’తో నయనతార తెరంగేట్రం చేసింది.
68/ 81
2005లో ‘అయ్యా’ చిత్రంలో శరద్ కుమార్ సరసన నటించిన నయనతార, ఆ చిత్రంతో తమిళ ప్రేక్షకులకు పరిచయమయ్యింది.
69/ 81
తమిళ్లో నయనతార నటించిన రెండో చిత్రం ‘చంద్రముఖి’. ఈ చిత్రంలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన నటించడంతో ఆమెకు దక్షిణాది వ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చింది.
70/ 81
2006లో ‘లక్ష్మి’ చిత్రంతో టాలీవుడ్లో అరంగేట్రం చేసింది నయనతార. అదే సంవత్సరం తెలుగులో మరో చిత్రం ‘బాస్’లోనూ నటించింది.
71/ 81
2011లో ‘శ్రీరామ రాజ్యం’ చిత్రంలో సీతపాత్రలో నయనతార తెలుగు ప్రేక్షకులను మెప్పించారు. దీనికి నయనతారకు ఫిల్మ్ ఫేర్ అవార్డు కూడా దక్కింది. ‘కృష్ణం వందే జగద్గురుం’(2012) కూడా నయనతారకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.
72/ 81
2015లో ఆమె నటించిన అన్ని సినిమాలు హిట్ సాధించడంతో కోలీవుడ్‌లో ఆమెను ‘లేడీ సూపర్ స్టార్’గా మెప్పు పొందింది.
73/ 81
వెరైటీ రోల్స్ చేస్తూ దూసుకెళ్తున్న నయనతారకు పలు అవార్డులు దక్కాయి. శ్రీరామ రాజ్యం చిత్రంతో పాటు మరో నాలుగు తమిళ చిత్రాలకు నయనతార ఫిల్మ్ ఫేర్ అవార్డులు సాధించింది.
74/ 81
‘ది గ్లామర్ క్వీన్ ఆఫ్ తమిళ్ సినిమా’గా ప్రశంసలు అందుకుంది నయనతార.
75/ 81
‘అదుర్స్’, ‘సింహా’ తదితర చిత్రాలు కూడా తెలుగులో ఆమెకు మంచి పేరు సాధించిపెట్టాయి.
76/ 81
2010లో ‘సూపర్’ చిత్రంతో కన్నడ ప్రేక్షకులకు కూడా పరిచయమైయ్యింది నయనతార. దక్షిణాదిలోని అన్ని భాషలు మలయాళం, తమిళ్, తెలుగు, కన్నడలో నటించిన నటిగా గుర్తింపు సాధించింది.
77/ 81
శ్రీరామ రాజ్యం(2011) చిత్రానికి గాను ‘ఉత్తమ నట’ కేటగిరీలో నంది అవార్డుకు నయనతార ఎంపికయ్యింది.
78/ 81
బోల్డ్ రోల్స్‌తో పాటు నటనకు అవకాశమున్న పలు పాత్రల్లో నటించి మెప్పించింది నయనతార