నయనతార పెద్ద మనసు.. సినీ కార్మికుల కోసం 20లక్షలు సాయం..

Nayanthara : లేడి సూపర్ స్టార్ నయనతార, దక్షిణాదిలోని నాలుగు భాషల్లోనూ నటిస్తూ అదరగొడుతోంది. చాలా కాలం తర్వాత ఆమె తెలుగులో చిరంజీవి 'సైరా నరసింహారెడ్డి'లో కథానాయికగా నటించింది. ఈ సినిమాను దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కించాడు. నయనతార మరోవైపు తమిళంలో ఇటూ హీరోయిన్‌గా చేస్తూనే మరో పక్క లేడీ ఓరియంటెడ్ సినిమాలతో దుమ్ము దులుపుతోంది. అదిఅలా ఉండగా కరోనా వల్ల తీవ్ర ఇబ్బందుల్నీ ఎదుర్కోంటున్న సినీ కార్మకులకు అండగా తన వంతుగా ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ సౌత్ ఇండియాకు నయన్ 20 లక్షల్నీ విరాళంగా ఇచ్చి తన పెద్ద మనుసు చాటుకుంది.