Nayanthara: నయనతారతో కలిసి సినిమా చూసే ఛాన్స్.. మిస్ కావొద్దంటే ఇలా చేసేయండి మరి!!
Nayanthara: నయనతారతో కలిసి సినిమా చూసే ఛాన్స్.. మిస్ కావొద్దంటే ఇలా చేసేయండి మరి!!
Nayanthara Connect: రీసెంట్ గా నయనతార పుట్టినరోజు సందర్భంగా కనెక్ట్ సినిమా టీజర్ రిలీజ్ చేసి సూపర్ రెస్పాన్స్ అందుకున్న చిత్ర యూనిట్.. ప్రస్తుతం చిత్ర ప్రమోషన్స్ పై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఈ మేరకు డిఫరెంట్ ప్లాన్స్ చేస్తూ ముందుకెళుతున్నారు.
లేడీ సూపర్ స్టార్ గా ప్రేక్షకుల మనసు దోచుకుంది నయనతార. సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్ గా కీర్తించబడుతున్న ఈ బ్యూటీ.. ప్రస్తుతం వెండితెరపై హవా నడిపిస్తోంది. ఈ క్రమంలోనే ఆమె నటించిన తాజా చిత్రం ‘కనెక్ట్’.
2/ 8
రౌడీ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మాత, దర్శకుడు, నయనతార భర్త విగ్నేష్ శివన్ ఈ కనెక్ట్ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ‘మాయా’, ‘గేమ్ ఓవర్’ వంటి చిత్రాలతో తన మార్క్ చూపించిన అశ్విన్ శరవణన్ దర్శకత్వం వహించారు.
3/ 8
రీసెంట్ గా నయనతార పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేసి సూపర్ రెస్పాన్స్ అందుకున్న చిత్ర యూనిట్.. ప్రస్తుతం చిత్ర ప్రమోషన్స్ పై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఈ మేరకు డిఫరెంట్ ప్లాన్స్ చేస్తూ ముందుకెళుతున్నారు.
4/ 8
ఈ సినిమాను హీరోయిన్ నయనతారతో కలిసి చూసే అవకాశాన్ని ప్రేక్షకులకు కల్పిస్తూ ఓ కొత్త స్కెచ్ వేశారు దర్శకనిర్మాతలు. ఈ మేరకు.. అలా నయన్ తో కలిసి సినిమా చూడాలంటే ఏం చేయాలి అనే విషయాన్ని వెల్లడించారు.
5/ 8
ఈ కనెక్ట్ మూవీ టీజర్‌పై తమ అభిప్రాయాలను ‘కనెక్ట్ టీజర్ రియాక్షన్’ అనే హ్యాష్ ట్యాగ్‌తో వెల్లడించాలని, వాటిలో ది బెస్ట్ కామెంట్స్ చేసిన వారిని ఎంపిక చేసి వారికి నయనతారతో కలిసి సినిమా చూసే అవకాశం కల్పిస్తామని అంటున్నారు మేకర్స్.
6/ 8
నయన్ విఘ్నేశ్ లవ్ స్టోరీ, పెళ్లి రూమర్ల మీద లెక్కలేనన్ని రూమర్లు రాగా.. ఎట్టకేలకు వాళ్లిద్దరూ పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. జూన్ 9న వీరిద్దరి పెళ్లి మహాబలిపురంలో గ్రాండ్‌గా జరిగింది. ఇంతలోనే రీసెంట్ గా వారికి కావలపిల్లలు అని తెలియడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
7/ 8
తమకు కవల మగ పిల్లలని చెప్పిన విగ్నేష్ శివన్.. మా ప్రార్థనలు, మా పూర్వీకుల ఆశీర్వాదాలతో ఇద్దరు పిల్లలు మా లైఫ్ లోకి వచ్చారు. మా కోసం మీ అందరి ఆశీస్సులు కూడా కోరుకుంటున్నా అని తెలిపారు. సరోగసీ పద్దతిలో నయన్ విగ్నేష్ దంపతులు పేరెంట్స్ అయ్యారు.
8/ 8
కాగా, కవల పిల్లలు పుట్టడంతో నయనతార సినిమాలకు కాస్త గ్యాప్ ఇవ్వనుందనే టాక్ కూడా స్ప్రెడ్ అవుతోంది. కొన్నేళ్లపాటు కెమెరా దూరంగా ఉండాలని ఆమె డిసైడ్ అయిందని, అందుకే కొత్త ప్రాజెక్టులు ఓకే చేయడం లేదని కోలీవుడ్ వర్గాల సమాచారం.