గత కొన్నేళ్లుగా నయనతార, విఘ్నేశ్ శివన్‌ల ప్రేమ వ్యవహారం వార్తల్లో నిలిచింది. ఎట్టకేలకు వీళ్లిద్దరు ఈ నెల 9న తమిళనాడులోని మహాబలిపురంలో షెరటాన్ గ్రాండ్ హోటల్లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు తమిళనాడుకు చెందిన సినీ, రాజకీయ ప్రముఖులు రజినీకాంత్, మణిరత్నంతో పాటు షారుఖ్ ఖాన్ వంటి ప్రముఖులు ఈ వేడుకకు వచ్చిన కొత్త దంపతలను ఆశీర్విదించారు. ఇక వీరి పెళ్లి తర్వాత వీళ్లిద్దరు హనీమూన్ ట్రిప్ కోసం థాయ్‌లాండ్‌లో లాండ్ అయ్యారు. (Instagram/Photo)
గౌతమ్ మీనన్ కు చెందిన కంపెనీ, అతడి టెక్నికల్ యూనిట్ ఈ పెళ్లికి సంబంధించిన చిత్రీకరణ బాధ్యత మొత్తం తీసుకుంది. ప్రతి క్షణాన్ని కెమెరాలో బంధించి, నయనతార, విఘ్నేష్ కు అందించబోతోంది. అంతేకాకుండా వీరి పెళ్లి వీడియోను నెట్‌ఫ్లీక్స్‌లో రెండు పార్టులుగా ప్రసారం చేయనున్నారు. ఆ సంగతి పక్కన పెడితే.. వీళ్లిద్దరు ఇపుడు థాయ్‌లాండ్ రాజధాని నగరం బ్యాంకాక్‌లో సందడి చేస్తున్నారు. (Instagram/Photo)
వీళ్లిద్దరు బ్యాంకాక్‌లోని సియామ్ హోటల్లో స్టే చేస్తున్నారు. ఇది బ్యాంకాక్‌లోని చావో ఫ్రేయా నది ఒడ్డున ఉంది. ఇక నయనతారకు సోషల్ మీడియాలో అకౌంట్ లేకపోయినా.. ఆమెకు సంబంధించిన విషయాలను పోస్ట్ చేయడానికి కొన్ని ఏజెన్సీలున్నాయి. ఇందులో ఆమెకు 10 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఈ నేపథ్యంలో సియామీ హోటల్ వాళ్లు నయనతార దంపతులకు ఉచితంగానే అకామిడేషన్ ఇస్తున్నారట. మరోవైపు ఈమె అట్లీ దర్శకత్వంలో షారుఖ్‌తో చేయబోయే సినిమా షూటింగ్లో కొంత భాగం ఇక్కడ చేయనున్నారు.దీంతో ఈ హోటల్ వాళ్లకు పేరుకు పేరు. పబ్లిసిటీకి పబ్లిసిటీ. (Instagram/Photo)
కోలీవుడ్‌లో నిర్మాత, దర్శకుడు, నటుడు, మాటల రచయిత అయిన విఘ్నేష్ ఒక్కో చిత్రానికి రూ. 1 నుండి 3 కోట్ల వరకు తీసుకుంటాడని టాక్. పాటలు రాసినందుకు అతనికి 1 నుండి 3 లక్షల రూపాయల వరకు పారితోషికం కూడా అందుతుంది. ఫోర్బ్స్ రిపోర్ట్ ప్రకారం.. విఘ్నేష్ నికర విలువ $44 మిలియన్లకు పైగా ఉంది, ఇది భారతీయ రూపాయలలో దాదాపు 300 మిలియన్లు.
ఇక విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో ’నానుమ్ రౌడీదాన్’ సినిమాలో తొలిసారి నయనతార నటించింది. అప్పటి నుంచి వీళ్లిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఈ సినిమాను తెలుగులో ‘నేను రౌడీనే’ పేరుతో డబ్ చేసి రిలీజ్ చేశారు. ఆ తర్వాత రౌడీ పిక్చర్స్ అనే సంస్థను స్థాపించి విఘ్నేష్ శివన్.. నేత్రికన్, కుజంగల్, వంటి చిత్రాలను నిర్మించారు.