ఎర్ర జెండ.. ఎర్రజెండా ఎన్ని యేళ్లో ఎర్రఎర్రని ఈ జెండ ఎన్నియెళ్లో అంటూ ఒకప్పుడు సిల్వర్ స్క్రీన్ ఎర్ర సినిమాలతో కళకళలాడేవి. వెండితెరపై ఓ వెలుగు వెలిగాయి. రాను రాను తెలుగులో ఈ తరహా చిత్రాలకు ఆదరణ తక్కువైంది. రీసెంట్గా మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కిన ‘ఆచార్య’ మూవీ ఎన్నో అంచనాలతో విడుదలై బాక్సాఫీస్ దగ్గర కుదేలైంది. తాజాగా అదే నక్సల్ బ్యాక్‌డ్రాప్‌లో విరాట పర్వం సినిమా రాబోతుంది. (Twitter/Photo)
ఒకప్పటిలా ఇలాంటి ఎర్ర జెండ సినిమాలకు ప్రేక్షకుల నుంచి ఆదరణ కరువైంది. అదే 80. 90 దశకంలో మాత్రం ఈ తరహా చిత్రాలను ప్రేక్షకులు ఆదరించారు. పైగా ఒకప్పటిలా ఇపుడు నక్సల్ ఉద్యమాలు తెలుగు రాష్ట్రాల్లో అంతగా లేవు. పైగా ఇప్పటి యూత్ అంతా 90 మధ్యలో 2000లో పుట్టిన వాళ్లకు నక్సల్ చేసిన ఒకప్పటి ఉద్యమాల గురించి అంతగా అవగాహన లేదు. (Twitter/Photo)
ప్రస్తుతం మన తెలుగు రాష్ట్రాల్లో నక్సలైట్ ఉద్యమాలు అంతగా లేవు. విరాట పర్వం సినిమా విషయానికొస్తే.. మహా భారతంలో పాండవులు.. కౌరవుల నుంచి తప్పించుకోవడానికీ విరాట రాజు కొలువులో అజ్ఞాత వాసం చేస్తారు. అదే తరహా జన జీవన స్రవంతికి దూరంగా నక్సల్స్ కూడా ఓ రకంగా ఆ జీవనం అజ్ఞాతంలోనే ఉంటారు. మన దేశంలో నక్సల్ అనే పేరు పశ్చిమ బంగాల్లో నక్సల్ బరి గ్రామంలో చారు మజుందార్ నాయకత్వంలో మొదలైంది. అప్పటి నుంచి ఈ ఉద్యమంలో ఉన్న వాళ్లను నక్సలైట్స్‌గా పిలవడం మొదలుపెట్టారు. తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాన్ని హస్తగతం అవుతుందన్న కారల్ మార్క్స్ సిద్ధాంతంతో ఈ ఉద్యమం కొనసాగుతోంది. (Twitter/Photo)
తాజాగా విడుదలైన ఆచార్య సినిమా పూర్తిస్థాయి నక్సల్స్ సినిమా కాదు. ఈ సినిమాలో నక్సలిజానికి భక్తికి లింకు చేసి తెరకెక్కించారు. అది బెడిసి కొట్టింది. దీంతో ఈ సినిమా ప్రేక్షకుల నిరాదరణకు గురైంది. అదే విరాట పర్వం సినిమా విషయానికొస్తే.. ఇది 90లలో జరిగిన నిజ జీవిత ఘటనల ఆధారంగా తెరకెక్కింది. ముఖ్యంగా ఈ సినిమా సాయి పల్లవి నేపథ్యంలో నడుస్తోందనే విషయాన్ని చిత్ర దర్శక, నిర్మాతలు ప్రస్తావించారు. ఇక సురేష్ బాబు కూడా ఈ సినిమా ఓటీటీ కోసమే తెరకెక్కించినట్టు చెప్పారు.
మరి థియేటర్స్‌లో ఈ సినిమా ఏ మేరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనేది చూడాలి. ఇక గత కొన్నేళ్లుగా నక్సల్ బ్యాక్ డ్రాప్లో వచ్చిన జార్జి రెడ్డి ఓ మోస్తరుగా నడిచింది. అంతకు ముందు వచ్చిన దళం, విరోధి, సమక్క సారక్క, స్వర్ణక్క, సాయి రామ్ శంకర్.. ‘143’ వంటి ఎర్ర చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమయ్యాయి. (Twitter/Photo)
ఇక ఆర్. నారాయణ మూర్తి ఎర్ర సైన్యం తో పాటు ఆయన నటించిన పలు చిత్రాలు బాక్సాఫీస్‌ను షేక్ చేశాయి. అంతకు ముందు మాదాల రంగారావు నటించిన ‘యువతరం కదిలింది’, ఇక మా భూమి, దాసరి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఒసేయ్ రాములమ్మా’ మోహన్ బాబు ‘అడివిలో అన్న’ , శ్రీరాములయ్య వంటి నక్సల్ బ్యాక్ డ్రాప్ చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయం సాధించాయి. (Twitter/Photo)
ఇక విరాట పర్వం విషయానికొస్తే.. ఈ సినిమా నిజ జీవిత ఘటనల ఆధారంగా తెరకెక్కింది. పేరుకు రానా హీరో అయినా.. సినిమా మొత్తం సాయి పల్లవి భుజ స్కందాలపై నడుస్తోంది. గత కొన్నేళ్లుగా ఇలాంటి ఎర్ర సినిమాలకు బాక్సాఫీస్ దగ్గర పెద్దగ వర్కౌట్ అవ్వడం లేదు. మరి ఆ సెంటిమెంట్‌ను బ్రేక్ చేస్తూ ‘విరాట పర్వం’ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి మాయ చేస్తుందో చూడాలి. (Twitter/Photo)