ఎర్ర సినిమాలు ఎవరు చూస్తారు ఇండస్ట్రీలో ఓ అభిప్రాయం ఉంది. కానీ ఒకప్పుడు ఆర్ నారాయణమూర్తి, ధవళ సత్యం, దాసరి లాంటి వాళ్లు ఈ ఎర్ర సినిమాలతో అద్భుతాలు చేసారు. ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసారు. నక్సలిజం బ్యాక్డ్రాప్లో వచ్చిన చాలా సినిమాలు సంచలన విజయం సాధించాయి. అయితే కొన్నేళ్లుగా క్రమంగా ఇలాంటి సినిమాలు తగ్గిపోయాయి. ఇప్పుడు మళ్లీ నక్సలిజం నేపథ్యంలో సినిమాలు వస్తున్నాయి. ముఖ్యంగా విడుదలకు సిద్ధమైన చిరంజీవి ఆచార్యతో పాటు.. రానా విరాటపర్వం సినిమాలు కూడా నక్సలిజం బ్యాక్డ్రాప్లోనే వచ్చాయి. మరి అలాంటి ఎర్ర సినిమాలేంటో ఒకసారి చూద్దాం..