నాని వరుసగా సినిమాలు చేస్తున్నారు. అందులో భాగంగా ఆయన యువ దర్శకుడు వివేక్ ఆత్రేయ డైరెక్షన్లో ‘అంటే సుందరానికి’ అనే సినిమాను చేస్తున్నారు. రిలీజ్‌కు రెడీగా ఉంది. తాజాగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ఈ టీజర్ విడుదల కార్యక్రమాన్ని మహేష్ బాబు AMB థియేటర్లో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో హీరో నాని, హీరోయిన్ నజ్రీయా, దర్శకుడు, నిర్మాత, ఇతర టెక్నికల్ టీమ్ పాల్గోన్నారు. ఇక యూట్యూబ్‌లో టీజర్‌కు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. Photo : Twitter
‘అంటే సుందరానికి’ సినిమాలో నాని బ్రాహ్మణ యువకుని పాత్రలో నటించారు. ఈ టీజర్ చూస్తుంటే.. అలనాటి భారతీ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన ‘సీతాకోక చిలుక’ సినిమాను గుర్తుకు తెచ్చింది. అది సీరియస్‌తో కూడిన ప్రేమకథ అయితే.. ఇందులో కామెడీ యాంగిల్లో ప్రెజెంట్ చేసాడు దర్శకుడు వివేక్ ఆత్రేయ. ఈ సినిమాలో హీరోయిన్ నజ్రియా క్రిష్టియన్ అమ్మాయి పాత్రలో నటించింది. మరి బ్రాహ్మణ యువకుడు, క్రిష్టియన్ అమ్మాయల ఇంటర్ రిలీజియన్ ప్రేమకు ఎలాంటి ఆటంకాలు ఏర్పడ్డాయి. వాటిని సుందరం ఎలా సాల్వ్ చేసాడనే దానిపై ఈ సినిమాను తెరకెక్కించినట్టు కనబడుతోంది. Photo : Twitter
నాని బ్రాహ్మణ యువకుడి పాత్రలో ఇరగదీసాడు. గతంలో చిరంజీవి, బాలయ్య, నాగార్జున, విక్రమ్, అల్లు అర్జున్ వంటి హీరోలు బ్రాహ్మణ యువకుల పాత్రల్లో నటించిన మెప్పించిన సంగతి తెలిసిందే కదా. ఇపుడు వాళ్ల బాటలో నాని కూడా బ్రాహ్మణ యువకుడి పాత్రలో నటించారు. పోస్టర్లో వీణ, కెమెరా కూడా ఉన్నాయి. ఇప్పటికే నాని.. ’కృష్ణార్జున యుద్ధం’లో రాక్ స్టార్ పాత్రలో అలరించిన సంగతి తెలిసిందేె కదా. ఇపుడు ‘అంటే సుందరానికి’ సినిమాలో అదే తరహా పాత్రలో కనిపించనున్నట్టు సమాచారం. ఈ సినిమా అడల్ట్ కామెడీ జానర్లో వస్తోందని తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించింది. ఈ సినిమా జూన్ 10న విడుదల చేస్తున్నట్టు చెప్పారు. ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళం, మలయాళంలో విడుదల చేస్తున్నారు. Photo : Twitter
‘అంటే.. సుందరానికి’ సినిమాలో నానికి జంటగా మలయాళీ నటి నజ్రియా నజీమ్ నటిస్తున్నారు. సంగీతం వివేక్ సాగర్ అందించారు. దీంతో పాటు నాని ప్రస్తుతం ‘దసరా’ సినిమాతో బిజీగా ఉన్నాడు.తెలంగాణ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. కీర్తి సురేష్ ఇందులో హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాను వచ్చే విజయ దశమి కానుకగా విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఈ సినిమాను ప్యాన్ ఇండియా లెవల్లో విడుదల చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన సంగతి తెలిసిందే కదా. ఈ సినిమా పూర్తి మాస్ ఎంటర్టైనర్గా రానుంది. Photo : Twitter
ఇక ఆ మధ్య ఈ సినిమా నుంచి నాని లుక్‌ను విడుదల చేశారు. లుంగీతో మాసీవ్‌గా ఉన్న నాని లుక్కు టెర్రిఫిక్‌గా ఉంది. దాంతో పాటు ఈ సినిమా నుంచి స్పార్క్ అంటూ టీజర్ లాంటిది విడుదల చేశారు. నోటిలో బీడీతో పూర్తి మాస్ లుక్‌లో నాని లుక్ కేక పుట్టిస్తోంది. ‘పుష్ప’లో అల్లు అర్జున్ డిఫరెంట్ లుక్‌లో ఎలా మెస్మరైజ్ చేసారో.. నాని లుక్ అదే విధంగా టెర్రిఫిక్‌గా ఉంది. ఈ లుక్ ఈ సినిమాపై అంచనాలు పెంచేసారు నాని. తమిళ్ పాపులర్ మ్యూజిక్ డైరెక్ట్ సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నారు. తెలంగాణ యువకుడి పాత్ర కోసం ఇక్కడి యాసపై పట్టుకోసం ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ ట్యూటర్ని కూడా నియమించుకున్నారట నాని. Photo : Twitter