Nani as Shyam Singha Roy | నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘శ్యామ్ సింగరాయ్’. ఇప్పటికే తెలుగులో విడుదలైన ఈ మూవీ ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మరోవైపు ఈ సినిమాను హిందీ తప్ప మిగతా దక్షిణాది భాషల్లో విడుదల చేస్తున్నారు. ఇక ఈ సినిమా విడుదలకు ఒక్క రోజు మాత్రమే మిగిలి ఉంది. ఈ సందర్భంగా నాని ఫ్యాన్స్ హైదరాబాద్‌లో నాని 63 అడుగుల భారీ కటౌట్‌ను ఏర్పాటు చేశారు. దానికి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.(Twitter/Photo)
ఈ సినిమాలో నాని సరసన సాయిపల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటించారు. కలకత్తా నగరం నేపథ్యంలో బ్రిటీష్ కాలంలో ఈ సినిమా సాగనుందని ఈ మూవీ ట్రైలర్‌తో తెలుస్తోంది. ఒక వింటేజ్ డ్రామాలా అనిపిస్తుంది శ్యామ్ సింగరాయ్. ఈ సినిమా డిసెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలకానుంది. ఇక రిలీజ్ దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమా యూనిట్ జోరు పెంచింది. (Twitter/Photo)
ఇక నాని నటించిన గత రెండు సినిమాలు ‘వీ’‘టక్ జగదీష్’ సినిమాలు ఓటీటీ వేదికగా విడుదలయ్యాయి. దాదాపు రెండేళ్లు గ్యాప్ తర్వాత నాని హీరోగా నటించిన సినిమా థియేటర్స్‌లో విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో నాని అభిమానులు ఆర్జీసీ క్రాస్ రోడ్స్‌లో దేవి 70 MM థియేటర్లో నాని భారీ కటౌట్ ఏర్పాటు చేశారు. అంతేకాదు దానికి సంబంధించిన పిక్స్‌ను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. (Twitter/Photo)
ఇప్పటి వరకు తెలుగులో చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి అగ్ర హీరోల సినిమాలకు ఆయా హీరోల అభిమానులు భారీ కటౌట్స్ ఏర్పాటు చేసేవారు. తాజాగా నాని అభిమానులు మేమెవరికీ తక్కువ అంటూ 63 అడుగులతో కూడిన భారీ కటౌట్ హైదారాబాద్‌లో ఏర్పాటు చేశారు. (Twitter/Photo)
శ్యామ్ సింగరాయ్’లో నాని టూ డిఫరెంట్ లుక్స్ లో నాని కనిపిస్తున్నారు. రీసెంట్గా విడుదలైన ట్రైలర్ యూట్యూబ్‌లో మంచి ఆదరణ పొందుతోంది. ఇక తమిళంలో విడుదలైన ట్రైలర్ కూడా ఆకట్టుకునే విధంగా ఉంది. శ్యామ్ సింగరాయ్ తమిళ వెర్షన్‌కు నాని సొంత డబ్బింగ్ చెప్పుకోవడం విశేషం. గతంలో ఒకటి రెండు తమిళ చిత్రాల్లో నటించిన అనుభవం ఉండటంతో నాని తమిళ ప్రజలకు తన గొంతుతో పలకరించనున్నారు. ఈ రోజు సాయంత్రం నుంచి యూఎస్‌తో పాటు పలు ప్రాంతాల్లో ‘శ్యామ్ సింగరాయ్’ ప్రీమియర్స్ షో ను ఏర్పాటు చేశారు. (Twitter/Photo)