ఇదిలా ఉంటే నాని శ్యామ్ సింగరాయ సినిమాతో ఓ రికార్డ్ సొంతం చేసుకున్నాడు. నాని హీరోగా నటించిన తాజా సినిమా ” శ్యామ్ సింగరాయ్ “. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ప్రొడక్షన్ నెంబర్ వన్‌గా వెంకట్ బోయనపల్లి ఈ మూవీని నిర్మించారు. నాని కేరీయర్ లోనే అత్యధిక బడ్జెట్ తో తీసిన మూవీ ఇదే కావడం విశేషం.
నాని శ్యామ్ సింగరాయ సినిమా క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 24 తెలుగు తో పాటు తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషలలో పాన్ ఇండియా రెంజ్ లో ఈ చిత్రం రిలీజ్ అయ్యింది. ఈ మూవీ ఫస్ట్ డే నుంచే ప్రేక్షకులను బాగా ఆకట్టుకొని… మంచి వసూళ్ళను సాధించింది. ఈ సినిమా ప్రపంచం లోనే నెట్ ఫ్లిక్స్ లో వీక్షించిన మూడవ సినిమాగా చరిత్ర సృష్టించింది. అందులోనూ ఈ రికార్డు సొంతం చేసుకున్న తొలి సినిమాగా గుర్తింపు తెచ్చుకుంది.