సింగరేణి నేపథ్యంలో భారీగా వస్తోన్న ఈ చిత్రాన్ని మార్చి 30న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేట్రికల్ రిలీజ్ కానుంది. అది అలా ఉంటే ఈ సినిమా అల్లు అర్జున్ పుష్ప సినిమా లాగా రెండు భాగాలుగా రాబోతున్నట్లు ఓవార్త వైరల్ అయిన సంగతి తెలిసిందే. కాగా అలాంటిదేమి లేదని.. సినిమా కేవలం ఒకటే పార్ట్ అంటూ నాని స్వయంగా ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. దీంతో రెండు పార్ట్లు అన్న రూమర్‌కు తెరపడింది. (Twitter/Photo)
ఈ సినిమాలో నాని.. నెవర్ బిఫోర్ రోల్లో కనిపించనున్నారు. భారీ అంచనాల నడుమ వస్తోన్న ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. ఇక మరోవైపు ఈ సినిమాకు సంబంధించి థియేట్రికల్ బిజినెస్ ఓ రేంజ్లో జరుగుతోందని తెలుస్తోంది. ఈ సినిమాకు బిజినెస్ నాని కెరీర్‌లోని హైయ్యెస్ట్ అని అంటున్నారు. దాదాపు రూ. 45 కోట్ల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ చేసినట్టు సమాచారం. (Twitter/Photo)
ప్యాన్ ఇండియా స్థాయిలో వస్తున్న దసరాలో నాని, కీర్తి సురేష్‌తో పాటు మరో కీలకపాత్రలో కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇతర పాత్రల్లో సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్ కనిపించనున్నారు. ఈ సినిమాను శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది. (Twitter/Photo)