Nani - Sree Vishnu - Bhala Thandhanana Teaser Talk | టాలీవుడ్ నటుడు శ్రీ విష్ణు గురించి ప్రత్యేక పరిచయమవసరం లేదు. తను మాత్రమే చేయగల విభిన్న కథలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నారు. తాజాగా ఈయన నటించిన ‘భళా తందనాన’ సినిమా టీజర్‌ను నాచురల్ స్టార్ నాని విడుదల చేశారు. సాయి కొర్రపాటి సమర్పణలో వారాహీ చలన చిత్రం పతాకంపై రజనీ కొర్రపాటి నిర్మించారు. చైతన్య దంతలూరి దర్శకత్వం వహించారు. (Twitter/Photo)
ఇక శ్రీ విష్ణు నుంచి సినిమా వస్తుందంటే.. ఏదో కొత్త తరహాగా ఉంటుందనే నమ్మకం ప్రేక్షకుల్లో పాతుకపోయింది. గతేడాది ‘గాలి సంపత్’ ‘రాజ రాజ చోర’తో పాటు గతేడాది చివర్లో ‘అర్జున ఫల్గుణ’ చిత్రంతో ప్రేక్షకులు ముందకు వచ్చారు. తాజాగా ఈయన ‘భళా తందనాన’ సినిమాతో ఆడియన్స్ ముందకు రానున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇపుడు ఈ సినిమా టీజర్‌ను నాని విడుదల చేసారు. ఈ టీజర్‌కు సోషల్ మీడియాలో దూసుకుపోతుంది. (Twitter/Photo)
ఈ సినిమాను చైతన్య దంతలూరి డైరెక్ట్ చేసారు. వారాహీ చలన చిత్రం పతాకంపై సాయి కొర్రపాటి సమర్ఫణలో రజనీ కొర్రపాటి ఈ సినిమాను నిర్మించారు. మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. ఈ చిత్రంలో శ్రీ విష్ణు సరసన కేథరిన్ నటించింది.ఈ సినిమాతో శ్రీ విష్ణుకు మంచి విజయం దక్కేలా కనిపిస్తోంది. ఇక నానికి, శ్రీ విష్ణు మధ్య మంచి బాండింగ్ ఉంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా టీజర్‌ను నాని విడుదల చేశారు. (Twitter/Photo)
*‘భళా తందనాన’ సినిమా యూనిత్తో హీరో నాని.. ఇక శ్రీ విష్ణు విషయానికొస్తే.. నారా రోహిత్ హీరోగా నటించిన ‘బాణం’ సినిమాతో నటుడిగా పరిచయమైన ఈయన.. ఆ తర్వాత ‘సోలో’, ‘లవ్ ఫెయిల్యూర్’, ‘నా ఇష్టం’, ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ చిత్రాల్లో చిన్న పాత్రల్లో నటించారు. ఇక ‘ప్రేమ ఇష్క్ కాదల్’ సినిమాలో రాయల్ రాజు పాత్ర శ్రీ విష్ణుకు మంచి పేరు తీసుకొచ్చింది. (Twitter/Photo)