‘అంటే సుందరానికీ’ కామెడీ ఎంటర్టేనర్ అని చెప్పినా.. అది పూర్థి స్థాయిలో ప్రేక్షకులను కనెక్ట్ కాలేదు. పైగా మాస్ ఆడియన్స్‌కు కిక్ ఇచ్చే అంశాలు ఎలాంటివి ఇందులో లేకపోవడంతో ఓ వర్గపు ప్రేక్షకులు ఈ సినిమాను చూడలేదు. పైగా థియేటర్స్‌లో టికెట్ రేట్స్ కూడా ఈ సినిమా వసూళ్లపై ప్రభావం చూపించింది. (Photo Twitter)
‘అంటే సుందరానికీ’’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా క్లోజింగ్ కలెక్షన్స్ విషయానికొస్తే.. ఏపీ, తెలంగాణలో కలిపి రూ. 13.70 కోట్లు షేర్ (రూ. 23.20 గ్రాస్) వసూళ్లను సాధించింది. కర్ణాటక, రెస్టాఫ్ భారత్, ఓవర్సీస్ కలిపి ఈ సినిమా రూ. 21.35 (రూ. 38 కోట్లు గ్రాస్ ) వసూళు చేసింది. ఈ సినిమా మొత్తంగా రూ. 30 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. రూ. 31 కోట్ల బ్రేక్ ఈవెన్‌తో బరిలో దిగి.. రూ. 9.65 కోట్ల నష్టాలను తీసుకొచ్చి ఫ్లాప్‌గా నిలిచింది. (Twitter/Photo)
మొత్తంగా ఒకపుడు యావరేజ్ సినిమాలతో సూపర్ హిట్స్ కొట్టిన నానికి ఇపుడు ఏ సినిమా చేసిన బాక్సాఫీస్ దగ్గర తేడా కొట్టేస్తోంది. ఒక్క జెర్సీ సినిమా కూడా జస్ట్ ఓకే అనిపించుకుంది. ఈ సినిమాలో నాని ఫ్యాక్టర్ మాత్రమే ఈ సినిమా విజయంలో కీ రోల్ పోషించింది. మొత్తంగా నాని కథల విషయంలో జాగ్రత్త పడే అవసరం ఏర్పడిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. Photo Twitter