నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన మూవీ ‘శ్యామ్ సింగరాయ్’.మూవీతో మంచి సక్సెస్ అందుకున్నారు. అంతకు ముందు నాని నటించిన రెండు చిత్రాలు ‘వీ’, ‘టక్ జగదీష్’ సినిమాలు ఓటీటీ వేదికగా విడుదలయ్యాయి. దాదాపు రెండేళ్ల తర్వాత నాని నటించిన సినిమా థియేటర్స్లో విడుదలై మంచి విజయం సాధించింది. తాజాగా ఈయన కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల అనే కొత్త దర్శకుడుతో ‘దసరా’ సినిమాకు పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. (Twitter/Photo)
ఈ సినిమాను శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై భారీగా ఎత్తున సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. తమిళ్ పాపులర్ మ్యూజిక్ డైరెక్ట్ సంతోష్ నారeయణ్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో నాని తెలంగాణ యువకుడిగా కనిపించనున్నారు. అంతేకాదు తెలంగాణ యాసలో మాట్లాడనున్నారని తెలుస్తోంది. తెలంగాణ యాసపై పట్టుకోసం ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ ట్యూటర్ని కూడా నియమించుకున్నాడు కూడా. (Twitter/Photo)