మరోవైపు నాని కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) అనే కొత్త దర్శకుడుతో ‘దసరా’ సినిమాన చేస్తున్నారు. రీసెంట్గా పూజా కార్యక్రమాలతో ఈ మూవీ ప్రారంభమైంది. కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తోంది. నాని హీరోగా నటించిన ‘దసరా’ సినిమాను విజయ దశమి రోజున ప్రకటించారు. ఈ సినిమాలో నాని తెలంగాణ యువకుడి పాత్రలో నటిస్తున్నారు. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా ద్వారా శ్రీకాంత్ ఓదేల దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఇప్పటికే షూటింగ్ జరుపుకుంటోంది. ఈ మూవీ కూడా ఈ యేడాది దసరా కానుకగా విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. మొత్తంగా నాని కూడా సినిమాల్లో తనకున్న క్రేజ్‌తో ఇపుడు యాడ్స్ చేయడం కూడా మొదలు పెట్టాడు. (Twitter/Photo)