National Film Awards | భారతీయ నటీనటులకు జాతీయ స్థాయిలో ఉత్తమ నటీనటులగా అవార్డు అందుకోవడం పెద్ద అఛీవ్మెంట్. ఈ కోవలో ఎంతో మంది నటులు జాతీయ స్థాయిలో ఉత్తమ నటులుగా నిలిచారు. ఇక బాలీవుడ్ నుంచి అజయ్ దేవ్గణ్ సహా పలువురు నటులు ఒకటికి మూడు సార్లు జాతీయ అవార్డు అందుకోవడం విశేషం. మొత్తంగా జాతీయ అవార్డులు అందుకున్న నటుల విషయానికొస్తే.. (File/Photo)
68వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో ఉత్తమ చిత్రంగా ‘సూరాయైపొట్రు’ ఎంపికైయింది. జాతీయ ఉత్తమ నటులుగా అజయ్ దేవ్గణ్, సూర్య ఈ అవార్డును సంయుక్తంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతులు మీదుగా అందుకున్నారు. జాతీయ ఉత్తమ నటుడు అవార్డును 15వ జాతీయ అవార్డుల నుంచి ఇవ్వడం ప్రారంభించారు. అందులో కొన్నిసార్లు ఇద్దరికీ కలిపి సంయుక్తంగా ప్రకటించిన సందర్భాలున్నాయి. మొత్తంగా జాతీయ స్థాయిలో దేశ వ్యాప్తంగా ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డులు అందుకున్న నటుల విషయానికొస్తే (Twitter/Photo)
అజయ్ దేవ్గణ్ - మమ్ముట్టి | 46వ జాతీయ చలన చిత్ర అవార్డులో భాగంగా 1998 యేడాదికి గాను జాతీయ ఉత్తమ నటుడు విభాగంలో ’డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్’ అనే ఇంగ్లీష్ సినిమాలోని నటనకు గాను జాతీయ ఉత్తమ నటుడు అవార్డు అందుకున్న మమ్ముట్టి. మరోవైపు ‘జక్మ్’ సినిమాలోని నటనకు అజయ్ దేవ్గణ్ కూడా ఈ జాతీయ అవార్డును సంయుక్తంగా అందుకున్నారు. (File/Photo)
సురేష్ గోపి - బాలచంద్ర మీనన్ | 45వ జాతీయ చలన చిత్ర అవార్డులో భాగంగా 1997 యేడాదికి గాను జాతీయ ఉత్తమ నటుడు విభాగంలో ’కాలియాట్టమ్’ అనే మలయాళ సినిమాలోని నటనకు గాను సురేష్ గోపి జాతీయ అవార్డును.. మరో మలయాళ నటుడు బాలచంద్ర మీనన్.. ‘సమంతరాంగల్’అనే మలయాళ సినిమాకు గాను సంయుక్తంగా జాతీయ అవార్డును అందుకున్నారు.(File/Photo)
మిథున్ చక్రబర్తి | 24వ జాతీయ చలన చిత్ర అవార్డులో భాగంగా 1976 యేడాదికి గాను జాతీయ ఉత్తమ నటుడు విభాగంలో ‘మృగయ’ అనే హిందీ సినిమాలోని నటనకు గాను మిథున్ చక్రబర్తి జాతీయ ఉత్తమ నటుడి అవార్డును అందుకున్నారు. హీరోగా మిథున్ చక్రబర్తి తొలి సినిమా ఇదే. ఫస్ట మూవీతోనే జాతీయ ఉత్తమ నటుడు అవార్డు అందుకున్న హీరోగా మిథున్ చక్రబర్తి రికార్డులకు ఎక్కాడు. (File/Photo)
ఉత్తమ్ కుమార్ | 15వ జాతీయ చలన చిత్ర అవార్డులో భాగంగా 1967 యేడాదికి గాను జాతీయ ఉత్తమ నటుడు విభాగంలో ‘ఆంటోని ఫిరంగి’ ‘చిరియాఖానా’అనే బెంగాలీ సినిమాల్లోని నటనకు గాను ఉత్తమ్ కుమార్ తొలి జాతీయ ఉత్తమ నటుడి అవార్డును అందుకున్నారు. ఈ అవార్డును 15వ జాతీయ అవార్డులను ఇవ్వడం ప్రారంభించారు. ఈ అవార్డు అందుకున్న తొలిహీరోగా ఉత్తమ్ కుమార్ రికార్డులకు ఎక్కారు. (File/Photo)