67వ జాతీయ చలన చిత్ర అవార్డులో భాగంగా జాతీయ ఉత్తమ నటుడు విభాగంలో ధనుశ్, మనోజ్ బాజ్‌పేయ్ సంయుక్తంగా అవార్డు అందుకున్నారు.ధనుశ్కు ఇది రెండో జాతీయ అవార్డు.గతంలో మనోజ్ బాజ్‌పేయ్.. నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్‌లో స్పెషల్ జ్యూరీ అందుకున్నారు. జాతీయ చలన చిత్ర అవార్డుల్లో జాతీయ ఉత్తమ నటీ నటీలకు సంబంధించిన అవార్డులను 15వ జాతీయ అవార్డులను నుంచి ఇవ్వడం ప్రారంభించారు. ఇప్పటి వరకు 53 సార్లు జాతీయ ఉత్తమ నటుడు అవార్డు ప్రధానం చేసారు. తాజాగా వీళ్లిద్దరు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతులు మీదుగా అందుకున్నారు. అందులో కొన్నిసార్లు ఇద్దరికీ కలిపి సంయుక్తంగా ప్రకటించిన సందర్భాలున్నాయి. మొత్తంగా జాతీయ స్థాయిలో దేశ వ్యాప్తంగా ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డులు అందుకున్న హీరోల విషయానికొస్తే..
67వ జాతీయ చలన చిత్ర అవార్డులో భాగంగా 2019 యేడాదికి గాను జాతీయ ఉత్తమ నటుడు విభాగంలో ‘అసురన్’ అనే తమిళ సినిమాలోని నటనకు ధనుశ్... ‘భోంస్లే ’ అనే హిందీ సినిమాలోని యాక్టింగ్‌కు మనోజ్ బాజ్‌పేయ్ సంయుక్తంగా అవార్డు అందుకున్నారు. తాజాగా వీళ్లిద్దరు ఈ అవార్డును వెంకయ్య నాయుడు చేతులు మీదుగా తీసుకోనున్నారు.(Twitter/Photo)
46వ జాతీయ చలన చిత్ర అవార్డులో భాగంగా 1998 యేడాదికి గాను జాతీయ ఉత్తమ నటుడు విభాగంలో ’డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్’ అనే ఇంగ్లీష్ సినిమాలోని నటనకు గాను జాతీయ ఉత్తమ నటుడు అవార్డు అందుకున్న మమ్ముట్టి. మరోవైపు ‘జక్మ్’ సినిమాలోని నటనకు అజయ్ దేవ్‌గణ్ కూడా ఈ జాతీయ అవార్డును సంయుక్తంగా అందుకున్నారు. (File/Photo)
24వ జాతీయ చలన చిత్ర అవార్డులో భాగంగా 1976 యేడాదికి గాను జాతీయ ఉత్తమ నటుడు విభాగంలో ‘మృగయ’ అనే హిందీ సినిమాలోని నటనకు గాను మిథున్ చక్రబర్తి జాతీయ ఉత్తమ నటుడి అవార్డును అందుకున్నారు. హీరోగా మిథున్ చక్రబర్తి తొలి సినిమా ఇదే. ఫస్ట మూవీతోనే జాతీయ ఉత్తమ నటుడు అవార్డు అందుకున్న హీరోగా మిథున్ చక్రబర్తి రికార్డులకు ఎక్కాడు. (File/Photo)
15వ జాతీయ చలన చిత్ర అవార్డులో భాగంగా 1967 యేడాదికి గాను జాతీయ ఉత్తమ నటుడు విభాగంలో ‘ఆంటోని ఫిరంగి’ ‘చిరియాఖానా’అనే బెంగాలీ సినిమాల్లోని నటనకు గాను ఉత్తమ్ కుమార్ తొలి జాతీయ ఉత్తమ నటుడి అవార్డును అందుకున్నారు. ఈ అవార్డును 15వ జాతీయ అవార్డులను ఇవ్వడం ప్రారంభించారు. ఈ అవార్డు అందుకున్న తొలిహీరోగా ఉత్తమ్ కుమార్ రికార్డులకు ఎక్కారు. (File/Photo)