Naresh - Pavitra Lokesh Marriage: నరేష్, పవిత్ర లోకేష గత కొన్నాళ్లుగా రిలేషిన్ షిప్లో ఉన్న విషయం తెలిసిందే. వీరిద్దరు సహజీవనం చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే న్యూఇయర్ సందర్భంగా పవిత్ర, నరేష్ తాము త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రకటించారు. తాజాగా వీళ్లిద్దరు అగ్నిసాక్షిగా మూడు ముళ్ల బంధంతో ఏడడుగులు వేసి ఒకటయ్యారు. వీరి పెళ్లిపై సోషల్ మీడియాలో రకరకాల వ్యాఖ్యానాలు చేస్తున్నారు. (Twitter/Photo)
గత కొన్ని రోజులుగా సినీ ఇండస్ట్రీలో నరేష్, పవిత్ర లోకేష్ పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలు వచ్చాయి. వాటిని నిజం చేస్తూ వీళ్లిద్దరు ఒకటయ్యారు. నరేష్, పవిత్ర గత కొన్నేళ్లుగా సహ జీవనం చేసారు. అంతేకాదు అప్పట్లో ఓ హోటల్ గదిలో వీళ్లు నరేష్ మూడో భార్యకు అడ్డంగా దొరికపోవడం అప్పట్టో హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో 2023 కొత్త యేడాది సందర్భంగా మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నట్టు నరేష్ అఫీషియల్‌గా ప్రకటించారు. దాన్ని ఈ రోజు నిజం చేస్తూ ఒకటయ్యారు. (Twitter/Photo)
ప్రముఖ హీరోయిన్ దర్శకురాలు విజయ నిర్మల కుమారుడైన నరేష్.. బాల నటుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన హీరోగా తన కంటూ ప్రత్యేకు గుర్తింపు తెచ్చుకున్నారు. ఈయనకు ఆల్రెడీ మూడు మ్యారేజ్లు జరిగాయి. సీనియర్ సినిమాటోగ్రాఫర్ శ్రీను కుమార్తెను వివాహం చేసుకున్నారు నరేష్. వీల్లిద్దరికీ ఓ కొడుకు కూడా ఉన్నాడు. అతని పేరు నవీన్ విజయ్ కృష్ణ (Naveen Vijay krishna). సెలబ్రిటీ కిడ్‌గా సినీ ఎంట్రీ ఇచ్చి రెండు, మూడు సినిమాల్లో కూడా నటించాడు నవీన్ విజయ్ కృష్ణ.
ఆ తర్వాత ప్రముఖ రచయిత దేవులపల్లి కృష్ణశాస్త్రి మనవరాలు రేఖా సుప్రియను పెళ్లి చేసుకున్నారు నరేష్. ఈ ఇద్దరికీ ఓ కొడుకు పుట్టిన తర్వాత ఆమెతో మనస్పర్థలు వచ్చి విడిపోయారు నరేష్. ఆ తర్వాత కాంగ్రెస్ నేత రఘువీరారెడ్డి తమ్ముడి కుమార్తె రమ్య రఘుపతిని పెళ్లి చేసుకున్నారు. వీరికో కుమారుడు ఉన్నాడు. ఆమెతో మనస్పర్థల కారణంగా విడాకుల నోటీసులు పంపించారు నరేష్. తాజాగా పవిత్ర లోకేష్‌తో నాల్గో పెళ్లి చేసుకున్నారు. (Twitter/Photo)
పవిత్ర లోకేష్ విషయానికొస్తే. ఆమె తండ్రి మైసూర్ లోకేష్ ప్రముఖ రంగస్థల , సినీ నటుడు. ఇక 16 యేళ్ల యంగ్ ఏజ్‌లో సినీ నటిగా రంగ ప్రవేశం చేసిన పవిత్ర లోకేష్ హీరోయిన్గా పలు సినిమాల్లో నటించింది ఆ తర్వాత క్యారెక్టర్స్ రోల్స్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఈమె ముందుగా ఒక సాప్ట్వేర్ ఇంజినీర్‌ను పెళ్లి చేసుకుంది.
ఆ తర్వాత అతనితో మనస్పర్ధల కారణంగా విడాకులు ఇచ్చింది. ఆ తర్వాత సుచీంద్ర ప్రసాద్ తో సహ జీవనం చేసి 2018 నుంచి అతనికి దూరంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో సీనియర్ నటుడు నరేష్‌కు దగ్గరైంది. ఈ యేడాదే వీళ్లిద్దరు పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రకటించారు. ఈ రోజు కొంత మంది బంధు మిత్రుల సమక్షంలో మూడు ముళ్ల బంధంతో ఒకటయ్యారు. ఇక ఈమెకు నరేష్‌తో మూడో పెళ్లి అవుతోంది. నరేష్‌కు నాల్గో మ్యారేజ్. ఈ నేపథ్యంలో రెండో వివాహాం చేసుకున్న సెలబ్రిటీలు ఎవరున్నారో మీరు ఓ లుక్కేయండి.. (File/Photo)
మంజు మనోజ్ | మంచు మనోజ్ తన స్నేహితురాలు అలేఖ్యరెడ్డిని రెండో వివాహాంతో పెళ్లి బంధంలో అడుగుపెట్టాడు. ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు, హీరోయిన్లు రెండో పెళ్లి చేసుకోవడం వెరీ కామన్. రీసెంట్గా మంచు మనోజ్ తనకు స్నేహితురాలైన మౌనిక రెడ్డిని వివాహాం చేసుకున్నారు. వీళ్లిద్దరికి ఇది రెండో మ్యారేజ్ కావడం విశేషం.
Singer Sunitha: టాలీవుడ్ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ సునీత 2021 జనవరి 9న తేదిన. మీడియా పర్సన్ రామ్ వీరపనేనిని ఆమె వివాహం చేసుకుంది. దీంతో వీరిద్దరి పెళ్లి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఈమె 19 ఏళ్లకే పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలకు తల్లి అయిన తర్వాత భర్త ప్రవర్తనతో విసిగిపోయిన సునీత విడాకులు ఇచ్చి కొన్నేళ్లుగా ఒంటరిగానే ఉంది. ఆ తర్వాాత చాలా యేళ్లకు రామ్ వీరపనేనిని వివాహాం చేసుకుంది. (File/Photo)
వనిత విజయ్ కుమార్ | దేవి, రుక్మిణి లాంటి సినిమాలతో తెలుగులో గుర్తింపు తెచ్చుకున్న నటి వనిత విజయ్ కుమార్. ఈమె కూడా పెళ్లిళ్ల విషయంలో రికార్డు నెలకొల్పింంది. ఇక ఈమె పీటర్ పాల్ అనే తమిళ దర్శకుడిని పెళ్లి చేసుకుంది వనిత. కాగా ఇప్పటికే ఈమెకు రెండుసార్లు పెళ్లైంది. విడాకులు తీసుకుని మూడో పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం అతనికి విడాకులు ఇవ్వాలనుకుంటోంది. (Twitter/Photo)