Pavitra-Naresh: పవిత్ర-నరేష్ హనీమూన్ మ్యాటర్, అసలు విషయం బట్టబయలు..!
Pavitra-Naresh: పవిత్ర-నరేష్ హనీమూన్ మ్యాటర్, అసలు విషయం బట్టబయలు..!
పవిత్ర లోకేష్ , నరేష్ గత కొన్ని రోజులుగా మీడియాలో హాట్ టాపిక్‌గా ఉన్నారు. నిత్యం వీరికి సంబంధించిన ఎన్నో వార్తలు చక్కర్లు కొడుతూ ఉన్నాయి. అయితే వీరిద్దరి పెళ్లికి సంబంధించిన రకరకాల వార్తలు కూడా వస్తున్నాయి.
తెలుగు నటుడు నరేష్, కన్నడ నటి పవిత్రా లోకేష్ ల ప్రేమ వ్యవహారం అనేక మలుపులు తిరుగుతోంది. వీరిద్దరూ తరచూ ఒకదాని తర్వాత మరొకటి ఇలా అనేక విషయాల్లో వార్తల్లో నిలుస్తున్నారు.
2/ 8
గత కొన్ని రోజులుగా... పవిత్ర నరేష్‌కు సంబంధించిన రకరకాల పిక్స్, వీడియోలో ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో వీరిద్దరి రిలేషన్ పై జనం రకరకాలుగా చర్చించుకుంటున్నారు.
3/ 8
పెళ్లి, హనీమూన్ ఫోటోలను షేర్ చేస్తున్న వారి అసలు రంగు ఇప్పుడు బయటపడుతోంది. తాజాగా వీటిపై ప్రముఖ నిర్మాత ఎంఎస్ రాజు మాట్లాడారు. ఇవన్నీ వ్యక్తిగత విషయాలు కావని, సినిమా కోసం తీసిన సన్నివేశాలని దర్శకుడు ఎంఎస్ రాజు పేర్కొన్నారు.
4/ 8
దర్శకుడు రాజు తన సినిమా కోసం నరేష్, పవిత్ర లోకేష్ ల ప్రేమకథను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఈ కథను దృష్టిలో ఉంచుకుని రెండు పాత్రలను డెవలప్ చేస్తున్నారట.
5/ 8
ఈ చిత్రానికి నరేష్ స్వయంగా నిర్మాత అని చెప్పుకొచ్చాడు. ఈ చిత్రానికి సెకండ్ ఇన్నింగ్స్ అని పేరు పెట్టారు. నరేష్ ఈ సినిమాను నిర్మించడం మరింత హాట్ టాపిక్‌గా మారింది.
6/ 8
ఈ విషయాన్ని రానున్న రోజుల్లో నరేష్ స్వయంగా అధికారికంగా చెప్పనున్నారని సమాచారం. అయితే నరేష్-పవిత్ర సినిమా సాకుతోనే ఈ హంగామా చేస్తున్నారని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు.
7/ 8
సెకండ్ ఇన్నింగ్స్ సినిమాలో పవిత్ర లోకేష్, నరేష పలు బోల్డ్ సీన్లలో నటించనున్నారని సమాచారం.
8/ 8
బోల్డ్ సినిమాలు చేయడానికి సిద్ధంగా ఉన్న ఎం.ఎస్ రాజు 'సెకండ్ ఇన్నింగ్స్' చిత్రానికి యాక్షన్ కట్ చెబుతున్నారు. సినిమా కథ ప్రకారం మొదటి పెళ్లి విడిపోయిన ఓ జంట సహజీవనం చేసి ఆ తర్వాత పెళ్లి చేసుకుంటారు.