సీనియర్ హీరో నరేష్ విషయానికొస్తే.. తెరపై ఏ రసాన్నైనా పండించగల ఆల్ రౌండర్. నటి, దర్శకురాలు విజయనిర్మల కొడుకుగా వారసత్వంగా హీరోగా తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. కామెడీ హీరోగా తనదైన ముద్రని వేసుకున్నారు. ప్రస్తుతం తండ్రిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నవ్వులు పండిస్తూ, బరువైన పాత్రలతో మెప్పిస్తున్నాడు. (File/Photo)
ప్రస్తుతం ఈయన తోటి నటి పవిత్ర లోకేష్‌తో సహ జీవనంతో వార్తల్లో నిలిచారు. గత కొన్ని రోజులుగా వీళ్లిద్దరి డేటింగ్ వ్యవహారం టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా నిలిచింది. న్యూ ఇయర్ సందర్భంగా వీళ్లిద్దరు పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రకటించారు. అప్పట్లో ఓ హోటల్ గదిలో వీళ్లు నరేష్ మూడో భార్యకు అడ్డంగా దొరికిపోవడం హాట్ టాపిక్‌గా మారింది. (File/Photo)'
నరేష్ ఒకప్పటి టాలీవుడ్ వెటరన్ హీరోయిన్ కమ్ దర్శకురాలైన విజయ నిర్మల కుమారుడు. ఈయన తండ్రి పేరు కే.ఎస్.మూర్తి. వీళ్ల అమ్మగారు సూపర్ స్టార్ కృష్ణను రెండో పెళ్లి చేసుకున్నారు. ఈయనకు కృష్ణ సవతి తండ్రి. ఇక నరేష్ కూడా తల్లి బాటలోనే చిన్నపుడే ‘రెండు కుటుంబాల కథ’ సినీ రంగ ప్రవేశం చేసారు. ఇక కామెడీ హీరోగా ఓ వెలుగు వెలిగారు. ఈయనకు మూడు పెళ్లిళ్లు జరిగాయి. (Twitter/Photo)
నరేష్ మొదటి భార్య విషయానికొస్తే.. ఈమె ప్రముఖ సీనియర్ సినిమాటోగ్రాఫర్ శ్రీను కుమార్తెను వివాహం చేసుకున్నారు. వీళ్లిద్దరికీ ఓ కుమారుడు కూడా ఉన్నాడు. అతని పేరు నవీన్ విజయ్ కృష్ణ (Naveen Vijay krishna). సెలబ్రిటీ కిడ్‌గా సినీ ఎంట్రీ ఇచ్చాడు. నందిని నర్సింగ్ హోమ్, కీర్తి సురేష్‌తో ‘ఐనా.. ఇష్టం నువ్వు’ అనే రెండు, మూడు సినిమాల్లో కూడా నటించాడు నవీన్ విజయ్ కృష్ణ. (File/Photo)
రెండో భార్య విషయానికొస్తే.. ఈమె ప్రముఖ రచయిత దేవులపల్లి కృష్ణశాస్త్రి మనవరాలు. పేరు రేఖా సుప్రియ.. మొదటి భార్యకు విడాకులు ఇచ్చిన తర్వాత ఈమెను రెండో పెళ్లి చేసుకున్నారు నరేష్. ఈ ఇద్దరికీ ఓ కొడుకు పుట్టిన తర్వాత ఆమెతో మనస్పర్థలు వచ్చి విడిపోయారు నరేష్. రెండో అబ్బాయి పేరు రణ్వీర్. ఇతను పెయింటర్ కమ్ ఆర్టిస్ట్. ప్రస్తుతం ఇతనికి 21 యేళ్లు ఉంటాయి. ప్రస్తుతం హీరో అయ్యే ప్రయత్నాల్లో ఉన్నాడు. (File/Photo)
నరేష్ మూడో భార్య విషయానికొస్తే.. ఈమె ఏపీ కాంగ్రెస్ నేత రఘువీరారెడ్డి తమ్ముడి కుమార్తె రమ్య రఘుపతిని మూడో పెళ్లి చేసుకున్నారు. వీరికో కుమారుడు ’తేజస్వని’ ఉన్నాడు. ఇతని వయసు దాదాపు 9 యేళ్లు ఉంటాయి. ఐదో తరగతి చదువుతున్నాడు. ప్రస్తుతం ఇతను తల్లితోనే ఉంటున్నాడు. ఇక ఆమెతో మనస్పర్థల కారణంగా విడాకుల నోటీసులు పంపించారు నరేష్. కానీ రమ్య రఘుపతి మాత్రం విడాకులు ఇవ్వనని భీష్మించుకొని కూర్చుంది.
నరేష్ విషయానికొస్తే.. 1960 జనవరి 20న చెన్నైలో జన్మించారు. ఈయన తండ్రి పేరు కృష్ణ మూర్తి. ఈయన చిన్నపుడే తండ్రి చనిపోయినట్టు పలు ఇంటర్వ్యూల్లో ప్రస్తావించారు. ఆయన ఎలా ఉంటారో తెలియదన్నారు. నరేష్ పుట్టేనాటికే తల్లి విజయనిర్మల టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా, ప్రొడ్యుసర్‌గా ఉన్నారు. దాంతోపాటు.. ఇంట్లో ఉండే సినీ వాతావరణం నరేష్ ని సినిమాల్లో కి వచ్చేలా చేసింది. 1970లో కృష్ణ, విజయ నిర్మల హీరో, హీరోయిన్లుగా నటించిన ‘రెండు కుటుంబాల కథ’ సినిమాతో బాల నటుడిగా తెరంగేట్రం చేసారు. (file/Photo)
ఆ తర్వాత జానర్ మార్చి కామెడీ సినిమాలు చేశారు నరేష్. ముఖ్యంగా హాస్య బ్రహ్మ జంధ్యాల దర్శకత్వంలో చేసిన ‘నాలుగు స్థంభాలాట’ మూవీ హీరోగా నరేష్‌కు మంచి పేరు తీసుకొచ్చింది. ఈ మూవీ సక్సెస్‌తో హీరోగా నరేష్ వెనుదిరిగి చూసుకోలేదు. ఆ తర్వాత జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన ‘రెండు జెళ్ల సీత’, ‘శ్రీవారికి ప్రేమలేఖ’ లాంటి సినిమాలతో కామెడీ హీరోగా సెటిలైపోయారు. ఈ సినిమాలతో నరేష్ కెరీర్ మలుపు తిరిగింది. ఈ సినిమాల్లో కామెడీతో పాటు.. లవ్ ని కూడా టచ్ చేసి రొమాంటిక్ హీరో అనిపించుకున్నారు. (Twitter/Photo)
జంధ్యాల దర్శకత్వంలో నరేష్ చాలా సినిమాల్లో నటించారు. జంధ్యాల అంటేనే ఆరోగ్యకరమైన కామెడీకి కేరాఫ్ అడ్రస్...నవ్వుల ఫ్యాక్టరీ...అందుకే నరేష్, జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన సినిమాలన్నీ నవ్వుల పువ్వులు పూయిస్తూ అటు ప్రేక్షకులను అలరిస్తూ...సినిమా హిట్ తో ఇటు నరేష్‌కు కామెడీ హీరోగా సక్సెస్ లు తెచ్చిపెట్టాయి. ఆ తర్వాత జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన ‘పుత్తడి బొమ్మ, ‘మొగుగు పెళ్లాలు ‘ ‘చూపులు కలిసిన శుభవేళ’, హై హై నాయకా’, ‘ బావ బావ పన్నీరు’ సినిమాలు ప్రేక్షకులను అలరించాయి. (File/Photo)
ఒకవైపు హీరోగా నటిస్తూనే.. వేరే హీరోల సినిమాల్లో ముఖ్యపాత్రలు పోషించారు. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన సినిమా ‘జీవన పోరాటం’. శోభన్ బాబు, రజినీకాంత్ వంటి హీరోలతో నటించి తనదైన సత్తా చాటారు. అటు వెంకటేష్‌తో కూడా ‘టూటౌన్ రౌడీ’, శృతిలయలు’ వంటి సినిమాల్లో సెకండ్ హీరో పాత్రల్లో మెప్పించారు. ఒకవైపు కామెడీ సినిమాలు చేస్తూనే.. ‘అగ్ని సమాధి’,సాహసమే నా ఊపిరి’ ‘శివ శక్తి’ వంటి సినిమాల్లో యాక్షన్ హీరోగా మెప్పించారు.
అటు తల్లి విజయ నిర్మల, జంధ్యాలతో పాటు వంశీ దర్శకత్వంలో చేసిన ‘కనక మహాలక్ష్మీ రికార్డింగ్ డాన్స్ ట్రూప్’ సినిమాలో గోపాలంగా నరేష్ నటనకు మంచి పేరు తీసుకొచ్చింది. ఈ సినిమా అప్పట్లో టాలీవుడ్లో పెద్ద సంచలన విజయం సాధించింది. నరేష్ కెరీర్ లో ఇలాంటి సినిమాలు ఎన్నో..అందులో ఒకటి 1991లో వచ్చిన చిత్రం భళారే విచిత్రం సినిమా.
జంబలకిడి పంబ సినిమా తెలుగు ఇండస్ట్రీలో ట్రెండ్ క్రియేట్ చేసింది. లేడీ ఓరియంటెడ్ మూవీలా వచ్చినా ఆ ఛాయలేవీ కనిపించకుండా ఎంతో హాస్యంగా అందరూ మెచ్చేలా రూపొందించిన ఈ సినిమా నరేష్ కు ఎంత పేరు తెచ్చిందో..దర్శకుడిగా ఈవీవీ సత్యనారాయణకు, హీరోయిన్ గా ఆమనికీ అంతే పేరు తెచ్చి సంచలనం సృష్టించింది ఈ సినిమా.
ఆ తర్వాత నరేష్ హీరోగా ‘ఆమె’, ‘సొగసు చూడతరమా’ వంటి సినిమాల్లో హీరోగా నటించారు. చివరగా కథానాయకుడిగా నటించింది గుణ శేఖర్ ‘సొగసు చూడతరమా’ సినిమాలో. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా స్థిర పడ్డారు. ఇన్నేళ్ల కెరీర్లో బాలకృష్ణ.. ‘శ్రీకృష్ణార్జున విజయం’, ఎన్టీఆర్.. ‘యమదొంగ’లో నారదుడి వేషంలో మెప్పించారు.
ఎన్నో సినిమాల్లో హీరోగా, కామెడీ హీరోగా, రొమాంటిక్ కామెడీ హీరోగా ప్రేక్షకులను అలరించిన నరేష్..మారుతున్న కాలానికి అనుగుణంగా మారుతూ ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్నారు. తండ్రిగా, మామాగా లాంటి వయసుకు తగ్గ పాత్రలతో అలరిస్తున్నారు నరేష్. అలా చేసిన సినిమాల్లో ’రంగస్థలం, ‘వీ’, దృశ్యం, భలే భలే మొగాడివోయి, గుంటూరు టాకీస్, నిన్నమొన్న వచ్చిన ‘మ్యాస్ట్రో’ ‘సూపర్ మచ్చి’, ‘హీరో’ లాంటి చాలా మూవీల్లోనూ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా తన స్టామీనా, స్టార్ డమ్ రుజువుచేసుకున్నారు నరేష్.
ఎక్కువగా కామెడీ సినిమాలే చేసినా అపుడపుడు యాక్షన్ సినిమాలతో ప్రేక్షకులను అలరించారు నరేష్ అంతేకాదు ప్రేక్షకుల హృదయాల్లో విలక్షణ హస్య నటుడుగా నిలిచిపోయారు ఈ నవ్వుల రారాజు. కేవలం సినిమాలకే పరిమితం కాకుండా భారతీయ జనతా పార్టీలో క్రీయా శీలకంగా వ్యవహరించారు. 1999లో హిందూపురం నుంచి లోక్‌సభకు పోటీ చేసారు. ఏపీ బీజేపీ స్టేట్ వింగ్ ప్రెసిడెంట్‌గా పనిచేశారు. స్టేట్ సెక్రటరీగా, జనరల్ సెక్రటరీగా పనిచేశారు. (File/Photo)