Nani: దసరాతో నాని అరుదైన రికార్డ్.. స్టార్ హీరోలందరినీ వెనక్కినెట్టేస్తూ సంచలనం
Nani: దసరాతో నాని అరుదైన రికార్డ్.. స్టార్ హీరోలందరినీ వెనక్కినెట్టేస్తూ సంచలనం
Nani Dasara: కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela)తో నాచురల్ స్టార్ నాని చేసిన ప్రయోగం సూపర్ సక్సెస్ అయింది. దసరాతో నాని అరుదైన రికార్డ్ సొంతం చేసుకున్నారు.
కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela)తో నాచురల్ స్టార్ నాని చేసిన ప్రయోగం సూపర్ సక్సెస్ అయింది. దసరా రూపంలో ఈ ఇద్దరూ కూడా భారీ హిట్ దిశగా దూసుకుపోతున్నారు. తొలి షోతోనే పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పలు రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది.
2/ 8
మార్చి 30న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదలైన పాన్ ఇండియా మూవీ దసరా.. ఓ రేంజ్ లో రెస్పాన్స్ అందుకుంటోంది. క్లాస్, మాస్ ఆడియన్స్ అంతా కూడా ఈ కథకు ఫిదా అయిపోతున్నారు. దీంతో దేశవిదేశాల్లో కలెక్షన్స్ పరంగా దూసుకుపోతూ వసూళ్ల ప్రవాహం పారిస్తోంది దసరా.
3/ 8
తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో భారీ వసూళ్లు రాబడుతున్న దసరా సినిమా అటు యూఎస్ లో కూడా హవా నడిపిస్తోంది. రూరల్ మాస్ ఎంటర్టైనర్ గా అక్కడి ఆడియన్స్ ని హుషారెత్తిస్తోంది. దీంతో నాని ఖాతాలో మరో అరుదైన రికార్డ్ నమోదైంది.
4/ 8
ఇప్పటికే యూఎస్ లో 1 మిలియన్ డాలర్ మార్క్ క్రాస్ చేసింది దసరా. ప్రీమియర్స్ తోనే హాఫ్ మిలియన్ డాలర్స్ కు పైగా రాబట్టిన ఈ సినిమా అదే జోష్ కంటిన్యూ చేస్తోంది. దసరా కలెక్షన్స్ 1 మిలియన్ కు చేరుకోవడంతో మహేష్ బాబు తప్ప మిగితా స్టార్ హీరోల రికార్డ్స్ కొల్లగొట్టేశారు నాని.
5/ 8
యూఎస్ లో 8 మిలియన్ డాలర్ల సినిమాలు ఉన్న హీరోగా నాని సరికొత్త రికార్డు నమోదు చేశారు. మిలియన్ డాలర్ క్లబ్ లో ఉన్న మన హీరోల లిస్ట్ చూస్తే.. 11 మిలియన్ డాలర్ మూవీస్ తో మహేష్ బాబు తొలి స్థానంలో ఉండగా.. ఆ తర్వాతి స్థానంలో నాని నిలిచారు. 7 సినిమాలతో ఎన్టీఆర్ మూడో స్థానంలో ఉన్నారు.
6/ 8
మరోవైపు ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర దసరా ఊచకోత కోస్తోంది. రెండో రోజు కూడా ఈ సినిమా మంచి వసూళ్లనే సాధించింది. అన్ని వర్గాల ప్రేక్షకులు ఈ సినిమాపై పాజిటివ్ ఫీడ్ బ్యాక్ ఇస్తున్నారు. పక్కా తెలంగాణ యాసతో వచ్చిన ఈ సినిమా వరల్డ్ వైడ్ సునామీ సృష్టిస్తోంది.
7/ 8
బొగ్గు గనుల నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో ప్రయోగాత్మక పాత్ర కనిపంచారు నాని. విడుదలకు ముందు వచ్చిన దసరా ఫస్ట్ లుక్, గ్లింప్స్, టీజర్, ట్రైలర్ సినిమాపై భారీ హైప్ తీసుకొచ్చాయి. ఈ సినిమాలో మాస్ యాక్షన్ రోల్ లో నాని కనిపించారు.
8/ 8
గతేడాది ‘అంటే సుందరానికీ’ సినిమాతో డిజాస్టర్ మూటగట్టుకున్న ఆయన.. ఈ సారి పక్కా ప్లానింగ్ తో రంగంలోకి దిగారు. తెలంగాణ లోని గోదావరిఖని సమీపంలో ఉన్న సింగరేణి ప్రాంతానికి చెందిన ఫిక్షనల్ విలేజ్ బ్యాక్డ్రాప్లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.