Nani as Shyam Singha Roy | నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘శ్యామ్ సింగరాయ్’. ఇప్పటికే తెలుగులో విడుదలైన ఈ మూవీ ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాను ప్యాన్ ఇండియా లెవల్లో తెలుగుతో పాటు హిందీ,తమిళం, కన్నడ, మలయాళంలో ఏక కాలంలో విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ తమిళ వెర్షన్‌కు సంబంధించిన ట్రైలర్‌ను చెన్నైలో విడుదల చేశారు. (Twitter/Photo)
ఈ సినిమాలో నాని సరసన సాయిపల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటించారు. కలకత్తా నగరం నేపథ్యంలో బ్రిటీష్ కాలంలో ఈ సినిమా సాగనుందని ఈ మూవీ ట్రైలర్‌తో తెలుస్తోంది. ఒక వింటేజ్ డ్రామాలా అనిపిస్తుంది శ్యామ్ సింగరాయ్. ఈ సినిమా డిసెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలకానుంది. ఇక రిలీజ్ దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమా యూనిట్ జోరు పెంచింది. (Twitter/Photo)
శ్యామ్ సింగరాయ్’లో నాని టూ డిఫరెంట్ లుక్స్ లో నాని కనిపిస్తున్నారు. రీసెంట్గా విడుదలైన ట్రైలర్ యూట్యూబ్‌లో మంచి ఆదరణ పొందుతోంది. ఇక తమిళంలో విడుదలైన ట్రైలర్ కూడా ఆకట్టుకునే విధంగా ఉంది. శ్యామ్ సింగరాయ్ తమిళ వెర్షన్‌కు నాని సొంత డబ్బింగ్ చెప్పుకోవడం విశేషం. గతంలో ఒకటి రెండు తమిళ చిత్రాల్లో నటించిన అనుభవం ఉండటంతో నాని తమిళ ప్రజలకు తన గొంతుతో పలకరించనున్నారు. (Twitter/Photo)
ఇప్పటికే ఎంసిఏ సినిమాలో నానికి జోడిగా నటించినసాయి పల్లవి శ్యామ్ సింగరాయ్ కోసం మరోసారి నటంచింది. ఇప్పటి వరకు సాయి పల్లవి చేయనటువంటి భిన్నమైన పాత్రను ఈ చిత్రంలో పోషిస్తుందని తెలుస్తుంది.సాయి పల్లవి మూవీలో బెంగాలీ దేవదాసీ అమ్మాయిగా నటించింది. . సాయి పల్లవి కారెక్టర్ పవర్ ఫుల్‌గా ఉంటుందని ట్రైలర్ చూస్తుంటేనే అర్థమవుతుంది. ఇక ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను నెట్ ఫ్లిక్స్ (Netflix) భారీ ధర చెల్లించి దక్కించుకుందని తెలుస్తోంది. మరి నాని కెరీర్లో తొలి ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ సినిమా తెలుగుతో పాటు మిగతా భాషల ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. (Twitter/Photo)