ఇప్పటికే రిలీజ్ అయిన శ్యామ్ సింగరాయ్ ఫస్ట్‌లుక్‌కు మంచి స్పందన లభించింది. కలకత్తా నగరం నేపథ్యంలో బ్రిటీష్ కాలంలో ఈ సినిమా సాగనుందని తెలుస్తోంది. ఒక వింటేజ్ డ్రామాలా అనిపిస్తుంది శ్యామ్ సింగరాయ్. ఈ సినిమా డిసెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషాల్లో విడుదలకానుంది. Photo : Twitter
టూ డిఫరెంట్ లుక్స్ లో నాని కనిపిస్తున్నారు. యూట్యూబ్‌లో మంచి ఆదరణ పొందుతోంది. అది అలా ఉంటే ఈ సినిమా కోసం నాని కొంత బోల్డ్ స్టెప్ వేశారని తెలుస్తోంది. ఈ సినిమా కోసం నాని తొలిసారి తమిళ వెర్షన్‌కు డబ్బింగ్ చెప్పారని తెలుస్తోంది. ఇక ఈ సినిమా తమిళ ట్రైలర్‌ను ఈరోజు చెన్నైలోని సత్యం సినిమాస్‌లో విడుదల చేసింది చిత్రబృందం. Photo : Twitter
మరోవైపు ప్రమోషన్స్‌లో భాగంగా ఆ మధ్య ఈ సినిమా నుంచి మరో పాటను విడుదల చేసింది చిత్రబృందం. 'ఏదో ఏదో' అంటూ సాగే ఈ ప్రేమగీతానికి మిక్కీ జె. మేయర్ మంచి వినసొంపైన సంగీతం అందించారు. ఈ పాటకు కృష్ణకాంత్ లిరిక్స్ అందించగా.. చైత్ర అంబడిపుడి పాడారు. నాని ఈ సినిమాలో శ్యామ్‌సింగ రాయ్, వాసు అనే రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారు. Photo : Twitter
నాని, హీరోయిన్ కృతి శెట్టి ల మధ్య వచ్చే రొమాంటిక్ సాంగ్ ఇది. పాటలో లిరిక్స్ చాలా బాగున్నాయి. మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ పాట విడుదలైన 24 గంటల్లో యూట్యూబ్‌లో మూడు మిలియన్ వ్యూస్ సాధించి అదరగొడుతోంది. దీంతో చిత్రబృందం దీనికి సంబంధించిన ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. ఇక ఈ సినిమాలో సాయి పల్లవి,(Sai Pallavi ) కృతి శెట్టి (Krithi Shetty) లతో పాటు మరో టాలెంటెడ్ నటుడు నటిస్తున్నారు. బెంగాళీ నటుడు జిష్షు సేన్ గుప్తా ఓ కీలకపాత్రలో కనిపించనున్నారు. Photo : Twitter
ఇక ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను నెట్ ఫ్లిక్స్ (Netflix) భారీ ధర చెల్లించి దక్కించుకుందని తెలుస్తోంది. అయితే థియేటర్లలో సినిమా విడుదల అయిన అనంతరం నెట్ ఫ్లిక్స్ లో శ్యామ్ సింగ రాయ్ స్ట్రీమ్ కానుంది. దాదాపు 8 కోట్లు పెట్టి నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా హక్కులను పొందిందని అంటున్నారు. ఈ విషయంలో అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది. ఈ చిత్రాన్ని నీహారిక ఎంటర్ టైన్మెంట్ పతాకం పై వెంకట్ బోయనపల్లి గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. Photo : Twitter