బొగ్గు గనుల నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో ప్రయోగాత్మక పాత్ర పోషిస్తున్నారు నాని. ఇప్పటికే విడుదల చేసిన దసరా ఫస్ట్ లుక్, గ్లింప్స్, టీజర్, ట్రైలర్ సినిమాపై భారీ హైప్ తీసుకొచ్చాయి. ఈ సినిమాలో మాస్ యాక్షన్ రోల్ లో నాని కనిపించనుండటం ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచింది. రా అండ్ రగ్గ్డ్ లుక్ లో నాని కనిపించబోతున్నారు.
ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు చాలా కట్స్ చెప్పడం విశేషం. సినిమా మొత్తం కలిపి 16 సీన్స్‌పై కట్స్ చెప్పింది సెన్సార్ బృందం. ఆడియో మ్యూట్, డైలాగ్స్ కట్స్ అన్నీ కలిపి చూసుకుంటే మొత్తం 36 చోట్ల కట్స్ చెప్పారట. ఇంత మొత్తంలో కట్స్ పెట్టిన ఈ చిత్రం ఈ విధంగా కూడా రికార్డు సృష్టించిందని చెప్పుకుంటున్నారు కొందరు.
తెలంగాణ లోని గోదావరిఖని సమీపంలో ఉన్న సింగరేణి ప్రాంతానికి చెందిన ఫిక్షనల్ విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ్, మలయాళ, కన్నడ భాషల్లో ఈ దసరా మూవీ రిలీజ్ కానుండటం విశేషం. ఈ మూవీ విడుదల కోసం నాని ఫ్యాన్స్ ఆతృతగా వెయిట్ చేస్తున్నారు.