Nani | Dasara : నాచురల్ స్టార్ నాని హీరోగా వచ్చిన లేటెస్ట్ మాస్ యాక్షన్ డ్రామా దసరా. మంచి అంచనాల నడుమ మార్చి 30న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమాను కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) డైరెక్షన్ చేశారు. కీర్తి సురేష్ (Keerthy Suresh) హీరోయిన్గా నటించారు. థియేటర్స్‌లో విడుదలైన ఈసినిమా బ్లాక్ బస్టర్ టాక్‌ను సొంతం చేసుకుంది. Photo : Twitter
అటు ఆంధ్రలో సీడెడ్‌లో కూడా కేక పెట్టిస్తోంది. మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు నాని కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ ని అందుకోవడం ఖాయం అంటున్నారు ట్రేడ్ పండితులు. ఈ బజ్‌ను బట్టి చూస్తే.. ఈ సినిమాకు 10 కోట్ల రేంజ్లో షేర్‌ను అందుకోనుందని అంటున్నారు. అంతేకాదు నైట్ షోలకి కూడా ఇదే ఫ్లో కంటిన్యూ అయితే ఈ కలెక్షన్స్ ఇంకా పెరిగే అవకాశం ఉందని అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. Photo : Twitter
పాటలు, ట్రైలర్‌తో మంచి బజ్ క్రియేట్ చేసిన ఈ సినిమా అదిరిపోయిందని.. నాని నటన కేక ఉందని.. కీర్తి కూడా ఇరగదీసిందని అంటున్నారు.. ముఖ్యంగా ఇంటర్నెల్ బ్లాక్ కేక పెట్టించిదని.. ఇంత వరకు తెలుగులో అలాంటీ ఎపిసోడ్ చూడలేదని అంటున్నారు. క్లైమాక్స్ కేక ఉందని.. కొద్దిగా ల్యాగ్ ఉందని అని కూడా అంటున్నారు. మొత్తానికి బొమ్మ బ్లాక్ బస్టర్ అనే టాక్ వినిపిస్తోంది. గోదావరి ఖని సమీపంలో ఓ విలేజ్ బ్యాక్ డ్రాప్‌తో తెరకెక్కిన ఈ రా అండ్ రస్టిక్ సినిమా ప్రేక్షకులను మెప్పించిందని అంటున్నారు. Photo : Twitter
నానికి బిగ్గెస్ట్ ఓపెనర్ అవ్వనుందని అంటున్నారు. ఇక ఈ సినిమాకు అమెరికాలో కూడా మంచి ఆదరణ వస్తోంది. అక్కడ ఈచిత్రం ఇప్పటికే 500K డాలర్స్ ప్రీ సేల్స్‌ను నమోదు చేసి అదరగొట్టింది. ఇక సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే సినిమా లాంగ్ రన్లో అదరగొట్టనుందని అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. ఈ సినిమాకు U/A సర్టిఫికేట్ వచ్చింది బోర్డ్. Photo : Twitter
దసరా సినిమా 2 గం. 36 ని. ల నిడివి ఉండనుంది. ఈ సినిమాలో నాని ధరణి పాత్రలో నటించారు. కీర్తి సురేష్ వెన్నెలగా కనిపించింది. తెలంగాణ సింగరేణి నేపథ్యంలో భారీగా వచ్చింది. నాని మాస్ సీన్స్‌కు తోడు పలు కీలక సన్నివేశాల్లో కీర్తి సురేష్ యాక్టింగ్ ఆడియన్స్ హృదయాలు తాకుతుందని అని అంటున్నారు నెటిజన్స్. Photo : Twitter
చమ్కీల అంగిలేసి.. (Chamkeela Angeelesi ) అనే పాట ఇన్స్టాంట్ హిట్‌గా నిలిచింది. మంచి లిరిక్స్‌తో అదరగొడుతోంది. తెలంగాణ యాస, భాషలతో ఉన్న పాటను కాసర్ల శ్యామ్ రాయగా.. రామ్ మిరియాల, థీ పాడారు. నాని, కీర్తి సురేష్, దీక్షిత్‌లతో పాటు ఇతర పాత్రల్లో సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్ కనిపించారు. Photo : Twitter
ఈ సినిమాను శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఒకేసారి విడుదలైంది. ఈ సినిమా ఓటీటీ రైట్స్ విషయానికి వస్తే.. నెట్‌ఫ్లిక్స్‌తో పాటు హాట్ స్టార్ ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను దక్కించుకుంది. సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు. సత్యన్ సూర్యన్ ఫోటోగ్రఫి. ఈ చిత్రాన్ని ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు.. Photo : Twitter
ఇక ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 2710 థియేటర్స్‌లో భారీగా విడుదలైంది. ఏ ఏరియాలో ఎన్ని థియేటర్స్‌లో విడుదలవుతుందంటే.. నైజాంలో 290+ థియేటర్స్‌లో విడుదలైంది. ఇక సీడెడ్ 190లో, ఆంధ్రా 410. మొత్తంగా ఏపీ తెలంగాణలో 900 థియేటర్స్‌లో విడుదలైంది. ఇక ఈ సినిమా కర్ణాటకలో 80, తమిళనాడులో 80, కేరళలో 100, హిందీ, రెస్టాఫ్ ఇండియాలో 750 థియేటర్స్‌లో విడుదలైంది. ఇక ఓవర్సీస్లో 800 థియేటర్స్.. ఇలా ప్రపంచవ్యాప్తంగా 2710 థియేటర్స్‌లో విడుదలైంది దసరా. Photo : Twitter
అది అలా ఉంటే దసరా ఓటీటీ రైట్స్‌కు భారీ ధర పలికినట్లు తెలుస్తోంది. దసరా స్ట్రీమింగ్ రైట్స్‌ను రెండు సంస్థలు దక్కించుకున్నాయి. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం భాషలకు చెందిన స్ట్రీమింగ్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకోగా.. హిందీ స్ట్రీమీంగ్ రైట్స్‌ను హాట్ స్టార్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా విడుదలైన ఎనిమిది వారాలకు ఈ రెండు ఓటీటీలో స్ట్రీమింగ్ రానున్నట్లు తెలుస్తోంది. Photo : Twitter
ఇక ఈసినిమా క్లైమాక్స్ కోసం ఏకంగా 5 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని తెలుస్తోంది. భారీ అంచనాల నడుమ వస్తోన్న ఈసినిమాలో పావుగంటపైగా క్లైమాక్స్ ఉంటుందని.. క్లైమాక్స్ ఎమోషనల్ సీన్స్‌తో సాగుతూ.. పాటు ఫైట్స్ ఉంటాయని అంటున్నారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని నాని మంచి నమ్మకంతో ఉన్నారు. ఇక ఈసినిమా కోసం నాని 20 కోట్ల రూపాయల రేంజ్లో రెమ్యూనరేషన్ తీసుకున్నారని అంటున్నారు. అయితే ఈ విషయంలో అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది. Photo : Twitter
ఇక ట్రైలర్ విడుదలైన కొన్ని గంటల్లోనే 20 మిలియన్ వ్యూస్‌ను రాబట్టి కేక పెట్టించింది. ముఖ్యంగా మాస్ ఎలిమెంట్స్ నెటిజన్స్‌కు మంచి కిక్‌ను ఇస్తున్నాయి. మాస్ అండ్ ఇంటెన్స్ యాక్షన్, ఎమోషనల్ డ్రామాగా వస్తోన్న ఈ సినిమా ట్రైలర్ యూట్యూబ్‌లో టాప్‌లో ట్రెండ్ అవుతోంది. దీంతో నాని సినిమాకు అక్కడ కూడా మంచి ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉంది. చూడాలి మరి నాని మొదటి ప్యాన్ ఇండియా సినిమా ఏ రేంజ్లో వసూళ్లను రాబట్టనుందో.. Photo : Twitter
ఇక ప్రమోషన్స్‌లో భాగంగా చమ్కీల అంగిలేసి.. (Chamkeela Angeelesi ) అనే పాట ఇన్స్టాంట్ హిట్‌గా నిలిచింది. మంచి లిరిక్స్‌తో అదరగొడుతోంది. తెలంగాణ యాస, భాషలతో ఉన్న పాటను కాసర్ల శ్యామ్ రాయగా.. రామ్ మిరియాల, థీ పాడారు. ఈ పాట తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళీ భాషాల్లో కూడా విడుదలైంది. Photo : Twitter
ఈ సినిమా తెలుగు రాష్ట్రాల రైట్స్‌ను ముందుగా చదలవాడ శ్రీనివాస్ విడుదలకు రెండు నెలల ముందే 24 కోట్ల రేంజ్ రేటుకి సొంతం చేసుకోగా.. ఆయన దగ్గర నుంచి నిర్మాత దిల్ రాజు 28 కోట్ల రేంజ్లో రేటు చెల్లించి దక్కించుకున్నాడని సమాచారం. ఇక ఈ సినిమా హిట్ టాక్ రావడంతో.. నాని కెరీర్‌లోని బిగ్గెస్ట్ హిట్‌గా దసరా నిలిచిపోనుంది. Photo : Twitter
సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు. సత్యన్ సూర్యన్ ఫోటోగ్రఫి. ఈ చిత్రాన్ని ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. ఈ సినిమాకు సంబంధించి నాన్ థియేట్రికల్ రైట్స్ కూడా రికార్డు ధరకు అమ్ముడు పోయాయని టాక్. దసరా నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా మేకర్స్ రూ.45 కోట్లు రాబట్టారట. నాని సినిమాల్లో ఇదో రికార్డ్ అని అంటున్నారు. Photo : Twitter
దసరా’ సినిమాకు తెలంగాణకు చెందిన సింగరేణి నేపథ్యంలో తెరకెక్కించారు. ప్యాన్ ఇండియా స్థాయిలో వచ్చిన ఈ దసరాలో నాని, కీర్తి సురేష్‌తో పాటు మరో కీలకపాత్రలో కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి కీలక పాత్రలో కనిపించారు. ఇతర పాత్రల్లో సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్ కనిపించారు. ఈ సినిమాను శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఒకేసారి విడుదలైంది. Photo : Twitter