Nani Dasara Pre Release Theatrical Business : నాచురల్ స్టార్ నాని కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) తో ‘దసరా’ అనే సినిమాను చేసారు. కీర్తి సురేష్ (Keerthy Suresh) హీరోయిన్‌గా నటిస్తున్నారు. మంచి అంచనాల నడుమ వస్తోన్న ఈ చిత్రం మార్చి 30న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేట్రికల్ రిలీజ్ కానుంది. అది అలా ఉంటే ఈ సినిమా ప్యాన్ ఇండియా లెవల్లో థియేట్రికల్ బిజినెస్ డీటెల్స్ ఇపుడు చర్చనీయాంశంగా మారింది. దీంతో పాటు నాని గత సినిమాల థియేట్రికల్ బిజినెస్ విషయానికొస్తే..
మొత్తంగా నాని కెరీర్లో నటించిన ‘V’ మరియు ‘టక్ జగదీష్’ సినిమాలు థియేటర్స్లో కాకుండా ఓటీటీ వేదికగా విడుదలయ్యాయి. తాజాగా దసరా మూవీ నాని కెరీర్లోనే ఎక్కవ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సినిమాగా రికార్డులకు ఎక్కాయి. మొత్తంగా శ్రీరామనవమి రోజున విడుదలవున్న ‘దసరా’ నాని కెరీర్లో ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి. (Twitter/Photo)