Nani Dasara 2nd Day Collections : నాచురల్ స్టార్ నాని కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) తో ‘దసరా’ అనే సినిమాను చేసారు. కీర్తి సురేష్ (Keerthy Suresh) హీరోయిన్గా నటిస్తున్నారు. మంచి అంచనాల నడుమ వస్తోన్న ఈ చిత్రం మార్చి 30న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేట్రికల్ రిలీజైంది. శ్రీరామ నవమి సందర్భంగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఊచకోత కోసింది. ఇక రెండో రోజు కూడా ఈ సినిమా మంచి వసూళ్లనే సాధించింది.
ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ఊహించని రేంజ్లో ( Dasara theatrical rights ) బిజినెస్ జరిగింది. దిల్ రాజు (Dil Raju)ఈ మూవీ సొంతం చేసుకున్నారు. ఇక లేటెస్ట్గా ఈ సినిమా కన్నడ థియేట్రికల్ రైట్స్‌కు కూడా అదిరిపోయే రేంజ్లో అమ్ముడు పోయింది. ఈ నేపథ్యంలో దసరా రైట్స్‌ను భారీ ధరకు కేజీయఫ్ (KGF) నిర్మాతలు హోంబాలే ఫిల్మ్స్‌కు దక్కించుకుంది. Photo : Twitter
ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా జరిగిన రెండో రోజు వసూళ్ల విషయానికొస్తే.. నైజాం (తెలంగాణ): రూ. 10.26 కోట్లు సీడెడ్ (రాయలసీమ): రూ. 3.02 కోట్లు.. ఉత్తరాంధ్ర: రూ. 2.06 కోట్లు.. ఈస్ట్: రూ. 1.18 కోట్లు.. వెస్ట్: రూ. 0.71 కోట్లు.. గుంటూరు: రూ. 1.46 కోట్లు.. కృష్ణా: రూ. 0.92 కోట్టు.. నెల్లూరు: రూ. 0.47 కోట్లు.. తెలంగాణ:+ ఆంధ్ర ప్రదేశ్ కలిపి రూ. 20.08 కోట్లు కర్ణాటక: + రెస్టాఫ్ భారత్ రూ. 2.15 కోట్లు.. నార్త్ భారత్‌లో .. రూ. 0.60కోట్లు.. ఓవర్సీస్ : రూ. 5.60 కోట్లు.. వరల్డ్ వైడ్ గా రూ. 29.08 కోట్లు (రూ. 52.40 కోట్ల గ్రాస్) వసూళ్లను సాధించి నాని కెరీర్లోనే హైయ్యెస్ట్ వసూళ్లను సాధించిన సినిమాగా రికార్డులకు ఎక్కింది.
ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా జరిగిన థియేట్రికల్ బిజినెస్ విషయానికొస్తే.. నైజాం (తెలంగాణ): రూ. 13.7 కోట్లు సీడెడ్ (రాయలసీమ): రూ. 6.5 కోట్లు.. ఉత్తరాంధ్ర: రూ. 3.9 కోట్లు.. ఈస్ట్: రూ. 2.35 కోట్లు.. వెస్ట్: రూ. 2 కోట్లు.. గుంటూరు: రూ. 3 కోట్లు.. కృష్ణా: రూ. 2 కోట్టు.. నెల్లూరు: రూ. 1.2 కోట్లు.. తెలంగాణ:+ ఆంధ్ర ప్రదేశ్ కలిపి రూ. 34.65 కోట్లు కర్ణాటక: రూ. 2.85 కోట్లు.. ఇతర భాషల్లో .. రూ. 1.5 కోట్లు.. నార్త్ భారత్‌లో .. రూ. 5 కోట్లు.. ఓవర్సీస్ : రూ. 6 కోట్లు.. వరల్డ్ వైడ్ గా రూ. 50 కోట్ల ప్రీ రిలీజ్ బిజనెస్ చేసింది. ఈ సినిమా హిట్ అనిపించుకోవాలంటే.. రూ. 51 కోట్లు రాబట్టాలి. మొత్తంగా నాని ముందు పెద్ద టార్గెట్ ఉంది. మొత్తంగా మొదటి రోజు వసూళ్లను పక్కనపెడితే.. రూ. 19.92 కోట్ల రాబడితే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుంటోంది. మొత్తంగా ఇదే ఊపు కంటిన్యూ అయితే.. బ్రేక్ ఈవెన్ కావడం పెద్ద సమస్య కాదు.
అది అలా ఉంటే దసరా ఓటీటీ రైట్స్‌కు భారీ ధర పలికినట్లు తెలుస్తోంది. దసరా స్ట్రీమింగ్ రైట్స్‌ను రెండు సంస్థలు దక్కించుకున్నాయి. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం భాషలకు చెందిన స్ట్రీమింగ్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకోగా.. హిందీ స్ట్రీమీంగ్ రైట్స్‌ను హాట్ స్టార్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా విడుదలైన ఎనిమిది వారాలకు ఈ రెండు ఓటీటీలో స్ట్రీమింగ్ రానున్నట్లు తెలుస్తోంది. Photo : Twitter
ఇక ఈసినిమా క్లైమాక్స్ కోసం ఏకంగా రూ. 5 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని తెలుస్తోంది. భారీ అంచనాల నడుమ వస్తోన్న ఈసినిమాలో పావుగంటపైగా క్లైమాక్స్ ఉంటుందని.. క్లైమాక్స్ ఎమోషనల్ సీన్స్‌తో సాగుతూ.. పాటు ఫైట్స్ ఉంటాయని అంటున్నారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని నాని మంచి నమ్మకంతో ఉన్నారు. ఇక ఈసినిమా కోసం నాని రూ. 20 కోట్ల రూపాయల రేంజ్లో రెమ్యూనరేషన్ తీసుకున్నారని అంటున్నారు. Photo : Twitter
ఇక లేటెస్ట్గా ఈ సినిమా సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది. చిన్న చిన్న కట్స్‌తో ఈ సినిమాకు U/A సర్టిఫికేట్ వచ్చింది బోర్డ్. అంతేకాదు రన్ కూడా లాక్ అయ్యింది. ఈ సినిమా 2 గం. 36 ని. ల నిడివి ఉంది. ఇక ఈసినిమా చూసిన సెన్సార్ సభ్యులు కూడా పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చినట్లు టాక్ నడుస్తోంది. దీంతో టీమ్ మరింత సంతోషంగా ఉందని అంటున్నారు. ఈ సినిమాలో నాని ధరణి పాత్రలో కనిపంచాడు. Photo : Twitter
కీర్తి సురేష్ వెన్నెలగా కనిపించింది. తెలంగాణ సింగరేణి నేపథ్యంలో భారీగా వస్తోన్న ఈ చిత్రాన్ని మార్చి 30న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేట్రికల్ రిలీజైంది. ఇక ఈ సినిమాలో మూడు అంశాలు సినిమాకి కీలకంగా మారనున్నాయట. తెలుస్తోన్న సమాచారం ప్రకారం దసరా మూవీలో స్నేహం, ప్రేమ, ప్రతీకారం మూడు అంశాలు హైలైట్‌గా ఉన్నాయి. మూడు ఏమోషన్స్తోనే సినిమాను దర్శకుడు అల్లు కున్నాడు. మాస్ సీన్స్‌కు తోడు పలు కీలక సన్నివేశాల్లో కీర్తి సురేష్ యాక్టింగ్ ఆడియన్స్ హృదయాలు తాకింది. Photo : Twitter
ఇక మరోవైపు ఈ సినిమాకు ఉన్న పాజిటివ్ బజ్‌తో అమెరికాలో ఓరేంజ్‌లో విడుదల చేస్తున్నట్లు తెలుస్తోంది. అక్కడ దాదాపుగా ఓ 700 లోకేషన్స్‌లో విడుదల అయింది. దసరా సినిమా అక్కడ అన్ని భాషలతో సహా 700+ లొకేషన్లలో ప్రీమియర్లు పడ్డాయి.. దీంతో నాని కెరీర్లో మొదటి $2M+ సినిమాగా దసరా నిలవనుందని అంటున్నారు ట్రేడ్ పండితులు. Photo : Twitter
సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. సత్యన్ సూర్యన్ ఫోటోగ్రఫి. ఈ చిత్రాన్ని ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. మార్చి 30న దేశవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు సంబంధించి నాన్ థియేట్రికల్ రైట్స్ కూడా రికార్డు ధరకు అమ్ముడు పోయాయని టాక్. దసరా నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా మేకర్స్ రూ.45 కోట్లు రాబట్టారట. నాని సినిమాల్లో ఇదో రికార్డ్ అని అంటున్నారు. Photo : Twitter
దసరా’ సినిమాకు తెలంగాణకు చెందిన సింగరేణి నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. ప్యాన్ ఇండియా స్థాయిలో వస్తున్న దసరాలో నాని, కీర్తి సురేష్‌తో పాటు మరో కీలకపాత్రలో కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇతర పాత్రల్లో సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్ కనిపించనున్నారు. ఈ సినిమాను శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఒకేసారి ప్రేక్షకులు ముందుకు వచ్చింది. Photo : Twitter