Nani | Ante Sundaraniki 6 Days WW Collections : నాని (Nani) నటించిన లేటెస్ట్ మూవీ అంటే సుందరానికి.. (Ante Sundaraniki). వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. తొలి రోజే ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. మొత్తంగా నాని గత సినిమాలతో పోలిస్లే.. ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్కు అనుకున్న స్థాయిలో వసూళ్లు దక్కలేదు. ఈ సినిమా మొత్తంగా 6 రోజుల్లో ఎంత రాబట్టిందంటే.. Photo Twitter
ఒకపుడు నాని ఏ సినిమాలు చేసిన ప్రేక్షకులు ఆదరించారు. అప్పటికీ నానికి అతని ఏజ్‌కు తగ్గ వేషాలు వచ్చాయి. వాటిని ప్రేక్షకులు కూడా ఆదిరించాయి. ఇపుడు వయసు పెరిగే కొద్దీ అలాంటి స్టోరీలే చేస్తానంటే ఆడియన్స్ అంగీకరించే స్థితిలో లేరు. తాజాగా ‘అంటే సుందరానికీ’ సినిమా రిజల్ట్‌తో నానికి తత్త్వం బోధపడింది. ఈ సినిమాకు తొలి రోజు మొత్తంగా రూ. 5 కోట్ల మాత్రమే వచ్చాయి.
మొత్తంగా ఒకపుడు యావరేజ్ సినిమాలతో సూపర్ హిట్స్ కొట్టిన నానికి ఇపుడు ఏ సినిమా చేసిన బాక్సాఫీస్ దగ్గర తేడా కొట్టేస్తోంది. ఒక్క జెర్సీ సినిమా కూడా జస్ట్ ఓకే అనిపించుకుంది. ఈ సినిమాలో నాని ఫ్యాక్టర్ మాత్రమే ఈ సినిమా విజయంలో కీ రోల్ పోషించింది. మొత్తంగా నాని కథల విషయంలో జాగ్రత్త పడే అవసరం ఏర్పడిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. Photo Twitter