Kalyan Ram: తారకరత్న ఆరోగ్య పరిస్థితి ఏంటి? కళ్యాణ్ రామ్ లేటెస్ట్ కామెంట్స్ విన్నారా..?
Kalyan Ram: తారకరత్న ఆరోగ్య పరిస్థితి ఏంటి? కళ్యాణ్ రామ్ లేటెస్ట్ కామెంట్స్ విన్నారా..?
Taraka Ratna Health Condition: తారకరత్నకు బెస్ట్ ట్రీట్ మెంట్ అందుతోందని చెప్పారు నందమూరి కళ్యాణ్ రామ్. ఈ మేరకు ఆయన చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
నందమూరి హీరో తారకరత్న ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. గత నెలలో గుండెపోటు గురైన ఆయన బెంగళూరు లోని నారాయణ హృదయాలయలో చికిత్స తీసుకున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి బాగా లేదని తెలిసి అభిమానులు ఆందోళన చెందారు.
2/ 8
బాలకృష్ణ స్వయంగా తారాకరత్న ఆరోగ్యంపై శ్రద్ద తీసుకుంటూ ఆసుపత్రిలోనే ఉండగా.. కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ వెళ్లి తారకరత్న ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని వచ్చారు. తారకరత్న ఆరోగ్యం క్రిటికల్ స్టేజీలోనే ఉందని, ఆయన్ను విదేశాలకు తరలించబోతున్నారని వార్తలు విన్నాం.
3/ 8
అయితే ఉన్నట్టుండి తారకరత్న హెల్త్ అప్ డేట్స్ బయటకు రానివ్వకపోవడంతో అంతా ఆశ్చర్య పోతున్నారు. గత కొన్ని రోజులుగా అటు ఆసుపత్రి వర్గాలు కానీ, ఇటు నందమూరి ఫ్యామిలీ మెంబర్స్ కానీ తారకరత్న ఆరోగ్యం విషయమై సైలెంట్ అయ్యారు.
4/ 8
ఈ నేపథ్యంలో కళ్యాణ్ రామ్ తాజా సినిమా అమిగోస్ ప్రమోషన్స్ లో భాగంగా ఆయనకు తారకరత్న హెల్త్ ఎలా ఉందనే ప్రశ్న ఎదురైంది. దీనిపై కళ్యాణ్ రామ్ రియాక్ట్ అవుతూ.. తారకరత్నకు బెస్ట్ ట్రీట్ మెంట్ అందుతోందని చెప్పారు. ఆయనను ఎప్పటికప్పుడు డాక్టర్లు పర్యవేక్షిస్తున్నారని అన్నారు.
5/ 8
తారకరత్నకు మెరుగైన వైద్యం అందుతోందని చెప్పిన కళ్యాణ్ రామ్.. అతని హెల్త్ కండీషన్ డాక్టర్లు చెబితేనే బాగుంటుందని అన్నారు. తామంతా తారకరత్న ఆరోగ్యం బాగుండాలని ప్రార్థిస్తున్నామని చెప్పారు. మీ అందరి ఆశీస్సులతో త్వరగా రికవర్ అవుతాడని కళ్యాణ్ రామ్ చెప్పారు.
6/ 8
నారా లోకేష్ ప్రారంభించిన యువగళం పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న.. సడన్ గా కుప్పకూలడంతో అంతా షాకయ్యారు. వెంటనే ఆయన్ను దగ్గరలోని ఆసుపత్రిలో చేర్చి ఆ తర్వాత బెంగళూరు లోని నారాయణ హృదయాలకు తరలించారు. ప్రస్తుతం ప్రత్యేక వైద్య బృందం ఆయనకు చికిత్స అందిస్తోంది.
7/ 8
తారకరత్న వైద్యంలో మిరాకిల్ జరిగిందని అంతకుముందు నందమూరి బాలకృష్ణ చెప్పారు. ఆయన హార్ట్ బీట్ ఆగిపోయిన.. తర్వాత మళ్లీ గుండె కొట్టుకోవడం మిరాకల్ అని చెప్పారు. శరీరంలో మిగతా ఆర్గాన్స్ అన్ని బాగానే ఉన్నాయి అని బాలయ్య బాబు చెప్పారు.
8/ 8
గతంలో తారకరత్నకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు. ఇది అనుకోకుండా జరిగింది. బ్యాడ్ లక్. హార్ట్ స్ట్రోక్ రావడంతో షాక్ కు గురయ్యాడు. ఆయన త్వరగా కోలుకోవాలని మనం ప్రార్ధిద్దాం అని తారకరత్న సోదరుడు చైతన్య కృష్ణ చెప్పారు.