Kalyan Ram: క్రిటికల్‌గా తారకరత్న హెల్త్ కండీషన్.. కళ్యాణ్ రామ్ ఎమోషనల్ పోస్ట్
Kalyan Ram: క్రిటికల్‌గా తారకరత్న హెల్త్ కండీషన్.. కళ్యాణ్ రామ్ ఎమోషనల్ పోస్ట్
Taraka Ratna Health: తారకరత్న ఆరోగ్య పరిస్థితి బాగా లేదని తెలిసి అటు టీడీపీ వర్గాలు, ఇటు నందమూరి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మరో నందమూరి హీరో, నిర్మాత నందమూరి కళ్యాణ్ రామ్ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.
నందమూరి వారసుడు, హీరో తారకరత్న హెల్త్ కండీషన్ పై సర్వత్రా ఆదోళన కనిపిస్తోంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందంటూ బెంగళూరు నారాయణ హృదయాలయ వైద్యులు వెల్లడించడంతో ఒక్కసారిగా అంతా షాకయ్యారు.
2/ 9
తారకరత్న ఆరోగ్య పరిస్థితి బాగా లేదని తెలిసి అటు టీడీపీ వర్గాలు, ఇటు నందమూరి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మరో నందమూరి హీరో, నిర్మాత నందమూరి కళ్యాణ్ రామ్ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.
3/ 9
ట్విట్టర్ ద్వారా రియాక్ట్ అయిన నందమూరి కళ్యాణ్ రామ్.. ''నా సోదరుడు నందమూరి తారకరత్న త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా. త్వరగా కోలుకోని పూర్తి ఆరోగ్యంతో తిరిగిరా'' అంటూ ట్వీట్ చేశారు. ఇది చూసి తారకరత్న ఆరోగ్యం కుదుటపడాలని అంతా కోరుకుంటున్నారు.
4/ 9
నారా లోకేష్ యువగళం కార్యక్రమంలో పాల్గొన్న తారకరత్న గుండెపోటుకు గురైన విషయం తెలిసిందే. పాద యాత్ర చేస్తుండగానే తారకరత్న గుండెపోటుకు గురి కావడంతో హుటాహుటీన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బెంగుళూరు నారాయణ హృదయాలయలో ప్రత్యేక వైద్య బృందం రంగంలోకి వైద్యం చేస్తోంది.
5/ 9
జనవరి 27 శుక్రవారం నారా లోకేష్ కుప్పం వేదికగా యువగళం పేరిట పాదయాత్ర ప్రారంభించారు. ఈ పాద యాత్ర మొదలైన కొద్దిసేపటికే తారకరత్న జనాల మధ్య నడుస్తూ కుప్పకూలిపోయారు తారకరత్న. ఆయన్ను హాస్పిటల్ కి తీసుకెళ్లగా పల్స్ రేటు పడిపోయిందని, శరీరం నీలం రంగులోకి మారిందని వైద్యులు తెలిపారు.
6/ 9
గుండెపోటుకు గురైన నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై నారాయణ హృదయాలయ వైద్యులు తాజాగా మరో హెల్త్ బులెటిన్ రిలీజ్ చేశారు. గుండె నాళాలకి రక్త ప్రసరణ జరగడం లేదని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి క్రిటికల్ గానే ఉందని చెప్పారు.
7/ 9
దీంతో బెంగళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రి వద్దకు పెద్ద ఎత్తున ఫ్యాన్స్ చేరుకున్నారు. ఇప్పటికే బాలకృష్ణ సహా నందమూరి కుటుంబ సభ్యులు హాస్పిటల్ చేరుకొని తారకరత్న ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు.
8/ 9
ప్రస్తుతం 10 మందితో కూడిన ప్రత్యేక డాక్టర్ల టీమ్ తారకరత్న ఆరోగ్యాన్ని క్షణక్షణం పర్యవేక్షిస్తూ చికిత్స చేస్తున్నారు. ఎక్మో పరికరం ద్వారా కృతిమ శ్వాస అందిస్తూ తారకరత్నను కాపాడుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు.
9/ 9
తారకరత్న గుండె నాళాల్లోకి రక్త ప్రసరణ సరిగా కావడం లేదని వెల్లడించారు తాజా హెల్త్ బులిటెన్ లో డాక్టర్లు వెల్లడించారు. దీంతో బెలూన్ యాంజియోప్లాస్టీ ద్వారా రక్తాన్ని పంపింగ్ చేసేందుకు ట్రై చేస్తున్నట్లు అందులో పేర్కొన్నారు.