Kalyan Ram DEVIL: ‘డెవిల్: ది బ్రిటీష్ సీక్రేట్ ఏజెంట్’గా వస్తున్న కళ్యాణ్ రామ్.. ఫస్ట్ లుక్ అదుర్స్..
Kalyan Ram DEVIL: ‘డెవిల్: ది బ్రిటీష్ సీక్రేట్ ఏజెంట్’గా వస్తున్న కళ్యాణ్ రామ్.. ఫస్ట్ లుక్ అదుర్స్..
Kalyan Ram DEVIL: టాలీవుడ్లో ప్రయోగాత్మక చిత్రాలు చేయడానికి చాలా తక్కువ మంది హీరోలు మాత్రమే ఉన్నారు. అందులో నందమూరి కళ్యాణ్(Kalyan Ram DEVIL) రామ్ కూడా కచ్చితంగా ఉంటాడు. జులై 5న కళ్యాణ్ రామ్ పుట్టిన రోజు సందర్భంగా కొత్త సినిమా పోస్టర్ కూడా విడుదలైంది.
టాలీవుడ్లో ప్రయోగాత్మక చిత్రాలు చేయడానికి చాలా తక్కువ మంది హీరోలు మాత్రమే ఉన్నారు. అందులో నందమూరి కళ్యాణ్ రామ్ కూడా కచ్చితంగా ఉంటాడు. కథ నచ్చితే తన ఇమేజ్‌కు సెట్ అవుతుందా లేదా.. కమర్షియల్‌గా వర్కవుట్ అవుతుందా లేదా అని చూడకుండా ప్రయోగానికి ముందడుగు వేస్తాడు.
2/ 6
అందుకే ఆయన కెరీర్లో అతనొక్కడే, పటాస్ లాంటి సంచలన విజయాలతో పాటు హరే రామ్, 118, ఓం త్రీడి లాంటి డిఫెరెంట్ సినిమాలు కూడా ఉన్నాయి. తాజాగా ఈయన చాలా బిజీగా ఉన్నాడు. మూడు సినిమాలు చేస్తున్నాడు కళ్యాణ్ రామ్.
3/ 6
బింబిసార అంటూ భారీ మైథలాజికల్ ప్రాజెక్ట్‌లో నటిస్తున్నాడు NKR. దాంతో పాటు 118 కాంబినేషన్ రిపీట్ చేస్తున్నాడు కళ్యాణ్ రామ్. రెండేళ్ళ తర్వాత మరోసారి కేవీ గుహన్‌తో కలిసి మరోసారి మర్డర్ మిస్టరీ కథతోనే రాబోతున్నాడు. ఈ సారి వీళ్ళకు తోడుగా దిల్ రాజు కూడా ఉన్నాడు. ఈ సినిమాను ఆయనే నిర్మించబోతున్నాడు.
4/ 6
జులై 5న కళ్యాణ్ రామ్ పుట్టిన రోజు సందర్భంగా మరో సినిమా పోస్టర్ కూడా విడుదలైంది. అభిషేక్ పిక్చర్స్ నిర్మాణంలో బాబు బాగా బిజీ ఫేమ్ నవీన్ మేడారం దర్శకత్వంలో డెవిల్ అనే సినిమా చేస్తున్నాడు కళ్యాణ్ రామ్. ది బ్రిటీష్ సీక్రేట్ ఏజెంట్ అనేది దీనికి ట్యాగ్ లైన్.
5/ 6
ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తుంటే స్వాతంత్య్రం నాటి కథ అనేది అర్థమవుతుంది. ప్రీ ఇండిపెండెన్స్ స్టోరీతో ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు కళ్యాణ్ రామ్. ఈ సినిమా కోసం తనను తాను చాలా మార్చుకున్నాడు కళ్యాణ్ రామ్. గెటప్ కూడా చాలా కొత్తగా అనిపిస్తుంది.
6/ 6
100 ఏళ్ళ కింద ఉండే ఏజెంట్స్ మాదిరే మారిపోయాడు నందమూరి హీరో. రన్నింగ్ ట్రైన్ నుంచి బయటికి వచ్చి గన్‌తో గురి పెట్టిన కళ్యాణ్ రామ్ లుక్ ఆకట్టుకుంటుంది. హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే మొదలు కానుంది.