Kalyan Ram - Bimbisara | నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన మూవీ ‘బింబిసార’. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది. మరోవైపు ఈ సినిమా జీ5 ఓటీటీలో కూడా స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా ఈ సినిమాలోని నటనకు గాను కళ్యాణ్ రామ్ ఉత్తమ నటుడిగా శ్రీ కళాసుధ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో 25వ ఉగాది పురస్కారాల ప్రధానోత్సం ఈ రోజు (శుక్రవారం) చెన్నై మ్యూజిక్ అకాడమీలో జరిగింది.
ఈ అవార్డు పురస్కారంలో ఉత్తమ నటుడిగా కళ్యాణ్ రామ్.. నటిగా .. సమంత.. ఉత్తమ చిత్రం .. బింబిసార.. బాపు బొమ్మ పురస్కారం .. ఈశ్వరీ రావు.. బాపు ,- రమణల పురస్కారం దర్శకుడు హనీ రాఘవపూడి.. పురస్కారం .. ఎమ్.ఎమ్. శ్రీలేఖ.. వీఎస్ఆర్ స్వామి పురస్కారం.. సినిమాటోగ్రఫర్ వంశీ పచ్చిపులుసు.. ఈ సందర్భంగా ప్రసాద్ ల్యాబ్ ప్రధాన నిర్వాహకుడు రమేష్ లైఫ్ టైమ్ అఛీవ్మెంట్ అవార్డును అందుకున్నారు. (Twitter/Photo)