ప్రస్తుతం మల్టీస్టారర్ సినిమాల హవా నడుస్తోంది. ఇద్దరు స్టార్ హీరోలను ఒకే తెరపై చూడటానికి తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు నేటితరం ఆడియన్స్. మరోవైపు బడా హీరోలిద్దరితో కలిపి ఒకే సినిమా తీసేందుకు మేకర్స్ సైతం ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా బయటకొచ్చిన ఓ అప్ డేట్ నందమూరి అభిమానులకు పూనకాలు తెప్పిస్తోంది.
ఇకపోతే నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న ఈ బింబిసార సినిమాతో విశిష్ట్ దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. నందమూరి తారక రామారావు ఆర్ట్స్ బ్యానర్‌పై ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమా రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి, చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్నారు. భారీ అంచనాల నడుమ ఆగస్టు 5న ఈ సినిమా రిలీజ్ కానుంది.