అలా ఒకే స్టోరీతో ఒకే రోజు బాక్సాఫీస్ బరిలో దిగిన హీరోల లిస్టులో బాలకృష్ణ, వెంకటేష్ కూడా ఉన్నారు. వీళ్లిద్దరు దాదాపు ఒకే తరహా కథను చేయడమే కాదు.. ఆ సినిమాలను ఒకే రోజు బాక్సాఫీస్ బరిలో రిలీజ్ చేసారు. ఈ రెండు సినిమాలు విడుదలై 32 యేళ్లు పూర్తవుతోంది. ఆ సినిమాలు ఏమిటంటే..అశోక చక్రవర్తి, ధృవనక్షత్రం’ సినిమాలు.(Twitter/Photo)
ఈ చిత్రాన్ని తమిళంలో ద్రవిడన్’గా సత్యరాజ్ రీమేక్ చేస్తే.. కన్నడలో ’చక్రవర్తి’ గా విష్ణువర్ధన్ రీమేక్ చేసారు. హిందీలో ‘ఆర్యన్ మేరా నామ్’గా డబ్ చేసి రిలీజ్ చేసారు. దాదాపు అన్ని భాషల సినిమాల్లో శరత్ సక్సేనా విలన్ పాత్రలో నటించడం విశేషం. అవన్ని సూపర్ హిట్ అవ్వడం మరో ప్రత్యేకత అనే చెప్పాలి.(Twitter/Photo)