తెలంగాణ (నైజాం)లో రూ. 15 కోట్లు.. సీడెడ్ (రాయలసీమ)లో రూ. 13 కోట్లు.. ఉత్తరాంధ్ర.. రూ. 9 కోట్లు.. తూర్పు గోదావరి.. రూ. 5.2 కోట్లు.. పశ్చిమ గోదావరి.. రూ. 5 కోట్లు.. గుంటూరు.. రూ. 6.40 కోట్లు.. కృష్ణ.. రూ. 5 కోట్లు.. నెల్లూరు .. రూ. 2.7 కోట్లు.. తెలంగాణ + ఆంధ్ర ప్రదేశ్ కలిపి రూ. 61.30 కోట్లు.. కర్ణాటక .. రూ. 4.50 కోట్లు.. రెస్టాఫ్ భారత్ .. రూ. 1 కోటి.. ఓవర్సీస్.. రూ. 6.2 కోట్లు.. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 73 కోట్ల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ చేసింది. ఈ సినిమా హిట్ అనిపించుకోవాలంటే రూ. 74 కోట్ల షేర్ రాబట్టాలి. (Twitter/Photo)
ఇప్పటికే వీరసింహారెడ్డి అడ్వాన్స్ బుకింగ్స్ రూపేణా.. హాఫ్ మిలియన్ మార్క్ దాటేసింది. ప్రీమియర్స్,.. ఫస్ట్ డే కలిపితే మొదటి రోజే వన్ మిలియన్ మార్క్ ఈజీగా క్రాస్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ముఖ్యంగా అఖండ వంటి భారీ సక్సెస్‌తో పాటు అన్‌స్టాపబుల్ షోతో బాలయ్య ఇమేజ్ మరింత పెరిగింది.ఇక అన్స్టాపబుల్తో బాలయ్యకు యూత్‌తో పాటు ఫ్యామిలీస్‌లో భారీ ఫాలోయింగ్ మరింత పెరిగింది. (Twitter/Photo)
ఇప్పటికే విడుదలైన ఈ సినిమాలో కూడా లెజెండ్ తరహాలో పొలిటికల్ డైలాగులు పేలాయి. ముఖ్యంగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ డైరెక్ట్ ఎటాక్ చేసారు. సంతకాలు పెడితే బోర్డు పై పేరు మారుతుందేమో... ఆ చరిత్ర సృష్టించిన వాడి పేరు మారుదు.. మార్చలేరు అంటూ.. రీసెంట్గా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును వైయస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చడంపై సెటైర్లు వేసారు బాలయ్య. (Twitter/Photo)
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ యాక్షన్ డ్రామాలో బాలయ్య, శృతి హాసన్‌తో పాటు దునియా విజయ్, వరలక్ష్మి శరత్‌కుమార్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. డిక్టేటర్, అఖండ తర్వాత థమన్ బాలయ్య వీరసింహారెడ్డికి సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన పాటలకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పటికే సంక్రాంతి బరిలో చిరంజీవి వాల్తేరు వీరయ్య, విజయ్ వారసుడు, అజిత్ తెగింపు సినిమాలు ఉన్నాయి. ఇప్పటికే అజిత్ ‘తెగింపు’ విడుదలై తెలుగులో యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది. ఇక మరికొన్ని గంటల్లో విడుదల కాబోతన్న వీరసింహారెడ్డితో బాలయ్య సంక్రాంతి హీరోగా మరో విజయాన్ని అందుకుంటాడా లేదా అనేది చూడాలి. (Photo : Twitter)