బాలయ్య హీరోగా రాబోతున్న పవర్ ఫుల్ ఏక్షన్ ఎంటర్టైనర్ వీరసింహారెడ్డి. మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ 107వ సినిమాగా ఈ మూవీ రూపొందుతోంది. ఎప్పుడైతే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేశారో అప్పటినుంచే నందమూరి ఫ్యాన్స్ బోలెడన్ని అంచనాలు పెట్టుకున్నారు. దీనికి తోడు ఈ మూవీ నుంచి వస్తున్న అప్ డేట్స్ ఇంకాస్త క్యూరియాసిటీ పెంచేశాయి.
హానీ రోజ్, వరలక్ష్మీ శరత్ కుమార్, కన్నడ స్టార్ దునియా విజయ్, మలయాళ నటుడు లాల్, నవీన్ చంద్ర, మురళీ శర్మ, ఈశ్వరీ రావు తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు.. ఎస్ఎస్ తమన్ బాణీలు కడుతున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్, వీడియోలు ఈ వీర సింహా రెడ్డిపై హైప్ పెంచేశాయి. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కాబోతున్న ఈ మూవీపై బాలయ్య ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు.