Balakrishna: సతీసమేతంగా కృష్ణంరాజు ఇంటికి వెళ్లిన బాలకృష్ణ.. ఆత్మీయ పరామర్శ
Balakrishna: సతీసమేతంగా కృష్ణంరాజు ఇంటికి వెళ్లిన బాలకృష్ణ.. ఆత్మీయ పరామర్శ
Krishnam Raju Death: ఇటీవల అనారోగ్యంతో దివంగతులైన రెబెల్ స్టార్ కృష్ణంరాజు గారి కుటుంబాన్ని సతీసమేతంగా పరామర్శించారు హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ హీరో నందమూరి బాలకృష్ణ.
ఇటీవల అనారోగ్యంతో దివంగతులైన రెబెల్ స్టార్ కృష్ణంరాజు గారి కుటుంబాన్ని సతీసమేతంగా పరామర్శించారు హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ హీరో నందమూరి బాలకృష్ణ. ఈ నేపథ్యంలో కృష్ణంరాజు గారితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
2/ 8
కృష్ణంరాజు మరణించిన సమయంలో గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న NBK107 సినిమా కోసం విదేశాలలో.. టర్కీ షెడ్యూల్ లో ఉన్నారు బాలకృష్ణ. అందుకే అప్పుడు ఆయన పార్ధీవ దేహాన్ని చూడడానికి రాలేకపోయారు.
3/ 8
షూటింగ్ అయిపోయిన వెంటనే ఇప్పుడు భార్య వసుంధర దేవితో సహా వచ్చి కృష్ణంరాజు గారి ఇంటికి వెళ్లి ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. ఎన్నో సంవత్సరాలుగా తమ మధ్య విడదీయరాని బంధం ఉందని.. నాన్నగారి సమయం నుంచి కృష్ణంరాజు గారిని చూస్తూ పెరిగానని బాలకృష్ణ అన్నారు.
4/ 8
సినిమా ఇండస్ట్రీకి కృష్ణంరాజు గారు ఎంతో సేవ చేశారని కొనియాడారు బాలకృష్ణ. అలాంటి అద్భుతమైన నటుడితో తనకు కూడా కలిసి నటించే అవకాశం వచ్చిందని.. తామిద్దరం సుల్తాన్, వంశోద్ధారకుడు సినిమాలలో కలిసి నటించామనే విషయం గుర్తు చేసుకున్నారు బాలకృష్ణ.
5/ 8
అలాగే ఆయనతో గడిపిన క్షణాలను అభిమానులతో పంచుకున్నారు. కృష్ణంరాజు గారు లేని లోటు ఎవరూ పూడ్చలేనిది అంటూ కుటుంబ సభ్యులను ఓదార్చి ఆయన చిత్ర పటానికి నివాళులు అర్పించారు బాలయ్య బాబు. రెబల్ స్టార్ ఫ్యామిలీతో చాలాసేపు ముచ్చటించారు బాలకృష్ణ, వసుంధరా దేవి దంపతులు.
6/ 8
అనారోగ్య కారణాలతో ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 82 సంవత్సరాల వయసులో కృష్ణం రాజు మరణించారు. లెజెండరీ యాక్టర్ మరణంతో యావత్ సినీ లోకంలో విషాదం అలుముకుంది. కృష్ణం రాజు ఇక లేరని తెలియగానే పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఘన నివాళి అర్పించారు.
7/ 8
మధుమేహం, పోస్ట్ కొవిడ్, తీవ్రమైన కార్డియాక్ అరెస్ట్‌తో కృష్ణం రాజు కన్నుమూశారని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. గత నెల 5న పోస్టు కొవిడ్ సమస్యలో ఆసుపత్రిలో చేరిన ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో మరణించారని తెలిపారు.
8/ 8
కృష్ణం రాజు స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు. 1940 జనవరి 20న కృష్ణం రాజు జన్మించారు. 183 సినిమాల్లో నటించారు. వాజ్ పేయి హయాంలో కృష్ణం రాజు కేంద్రమంత్రిగా కూడా పని చేశారు. సినీ ఇండస్ట్రీకి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ పలువురు సీనియర్ నటులు ఎమోషనల్ అయ్యారు.