ఇదిలా ఉంటే ఈ షోలో బాలకృష్ణ బూతులు మాట్లాడటం సంచలనంగా మారింది. నీకు ఓ అవకాశం ఇస్తున్నా.. నువ్వు నన్ను డైరెక్ట్ చేయమని బాలకృష్ణ అంటారు. అప్పటికప్పుడు విశ్వక్సేన్ మీకు ఫాన్స్ కావాలా? హీరోయిన్ కావాలా? అని అడుగుతానని, దానికి మీరు మింగితే షేప్ అవుట్ అవుతావు అని అనమని అంటాడు. అదే డైలాగ్ బాలకృష్ణ రిపీట్ చేయడానికి ప్రయత్నించగా ఆయన నోటి వెంట మింగితే బదులు ఓ బూతు మాట దొర్లింది.
మాస్ దాస్, మాస్ కా బాప్ లతో తేడా సింగ్ అంటూ యూత్ ఆడియన్స్ టార్గెట్గా ఈ ఎపిసోడ్ ప్లాన్ చేశారు మేకర్స్. అందుకు తగ్గట్లుగానే కిక్కిచ్చే విషయాలపై ఇంటర్వ్యూ సాగింది. యూత్ ఆడియన్స్ని పిచ్చెక్కించే ప్రశ్నలతో సిద్ధు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్ లపై అటాక్ చేశారు బాలయ్య. ప్రస్తుతం ఈ ఎపిసోడ్ ఆహాలో స్ట్రీమ్ అవుతోంది.