ఈ చిత్రంలో మణిశర్మ ఇచ్చిన నేపథ్య సంగీతంతో పాటు పాటలు సూపర్ హిట్‌గా నిలిచాయి. నరసింహనాయుడు చిత్రానికి పరుచూరి బ్రదర్స్ రాసిన మాటలు తూటాల్లా పేలాయి. ముఖ్యంగా ఈ చిత్రంలో బాలయ్య చెప్పే.. కత్తులతో కాదురా..కంటి చూపుతో చంపేస్తా అన్న డైలాగ్ మాత్రం అప్పటికీ ఇప్పటికీ ఎవర్ గ్రీన్‌గా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నిలిచిపోయింది. (Twitter/Photo)
నరసింహనాయుడు సినిమాలో బాలకృష్ణ ట్రెయిన్ లోంచి దిగే సీన్ హైలెట్ అని చెప్పాలి. ఈ సినిమాలో ట్రెయిన్‌ను చేజ్ చేస్తూ విలన్లు వెంబండించే సీన్‌ను షోలే సినిమాను స్పూర్తిగా తీసుకొని దర్శకుడు బి.గోపాల్ తెరకెక్కించారు. తెలుగులో ఇలాంటి ఛేజ్ చేసే ఈ సినిమాతోనే మొదలైంది. ఈ సినిమా 20 కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ జరుపుకుంది. (Twitter/Photo)
మొత్తంగా 22 యేళ్ల క్రితం విడుదలైన ఈ చిత్రాన్ని తమిళంలో అర్జున్ హీరోగా ‘ఏడుమలై’ గా రీమేక్ చేసారు. తెలుగులో సిమ్రాన్ చేసిన పాత్రనే తమిళంలో సిమ్రాన్ చేసింది. కానీ అక్కడ ఈ సినిమా అనుకున్నంత రేంజ్లో పర్పామ్ చేయలేదు. మొత్తంగా 22 యేళ్ల క్రితం నరసింహానాయుడు క్రియేట్ చేసిన కొన్ని రికార్డులు ఇప్పటికీ పదిలంగా ఉన్నాయి. (Twitter/Photo)