తొలుత అన్స్టాపబుల్ అంటూ తెరపైకి వచ్చిన బాలయ్య బాబు.. తనదైన మాటతీరు, హావభావాలతో పిచ్చెక్కించారు. గెస్టులుగా వచ్చిన సెలబ్రిటీలతో సరదాగా మాట్లాడుతూనే వారి వారి వ్యక్తిగత, ప్రొఫెషనల్ విషయాలపై ఎన్నో సంగతులు బయటకు తీసుకుకొచ్చారు. దీంతో అదే ఊపులో అన్స్టాపబుల్ 2 కూడా షురూ చేసి సక్సెస్ అయింది ఆహా యాజమాన్యం.