అంతేకాదు ఈ ఈవెంట్‌కి అభిమానులు పెద్ద ఎత్తున హాజరయ్యేందుకు గాను సికింద్రాబాద్ నుంచి స్పెషల్ ట్రైన్ వేస్తున్నారని టాక్. హైదరాబాద్ నుంచి తెలుగు రాష్ట్రాల్లోని వివిధ సిటీల గుండా ఈ ట్రైన్ ప్రయాణించి వైజాగ్ చేరుకుంటుందని తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ సిటీల నుంచి పెద్ద ఎత్తున పబ్లిక్ హాజరయ్యేలా ఈ ప్లాన్ చేశారని సమాచారం.
వాల్తేరు వీరయ్య సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ చేసిన చిరంజీవి మాస్ లుక్ ఫ్యాన్స్‌ను అమితంగా ఆకట్టుకుంది. మాస్ కమర్షియల్ అంశాలు ఫుల్లుగా ఉండేలా ఈ వాల్తేరు వీరయ్య కథ రాసుకున్నారట డైరెక్టర్ బాబీ. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ కేటాయించి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా పర్ఫెక్ట్ అవుట్ పుట్ కోసం యూనిట్ అంతా శ్రమిస్తోందట.