Home » photogallery » movies »

NANDAMURI BALAKRISHNA AKHANDA MOIVIE COLLECTED RS ONE CRORE GROSS AT RTC X ROADS HYDERABAD TA

NBK- Akhanda : బాలకృష్ణ ‘అఖండ’ మరో సెన్సేషనల్ రికార్డు.. హైదరాబాద్ ఆర్జీసీ క్రాస్‌ రోడ్‌లో రూ. కోటి కలెక్ట్ చేసిన మూవీ..

నందమూరి నట సింహం బాలకృష్ణ  రెండు విభిన్న పాత్రల్లో  మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను డైరెక్ట్ చేసిన యాక్షన్ ఫిల్మ్ అఖండ (Akhanda). ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటించింది.  జగపతిబాబు, శ్రీకాంత్‌, పూర్ణ  ఇతర కీలక పాత్రలో నటించారు. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. భారీ అంచనాల నడుమ గతేడాది డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి వసూళ్లను రాబడుతోంది. తాజాగా ఈ చిత్రం హైదరాబాద్ RTC X రోడ్స్‌లో రూ. కోటి రూపాయల గ్రాస్ వసూళ్లు సాధించినట్టు చిత్ర చిత్ర యూనిట్ ప్రకటించింది.