బాలయ్య ఓటిటిలోకి వస్తున్నాడని తెలిసిన వెంటనే అభిమానులు పండగ చేసుకున్నారు. ఇక ఆయన హోస్టుగా మారుతున్నాడని తెలిసిన మరుక్షణం నుంచి ఫ్యాన్స్ అయితే గాల్లో తేలిపోతున్నారు. ఎప్పుడెప్పుడు ఆయన యాంకరింగ్ చూద్దామా అని కళ్లలో ఒత్తులేసుకుని వేచి చూస్తున్నారు. అలాంటి వాళ్లకు మరో తీపికబురు వచ్చేసింది. తాజాగా బాలయ్య షోకు సంబంధించిన ప్రోమో విడుదల చేసారు ఆహా నిర్వాహకులు.
ప్రశాంత్ వర్మ ఈ షోను డైరెక్ట్ చేస్తున్నాడు. తొలి సీజన్లో 12 ఎపిసోడ్స్ ఉంటాయని.. అందులో చిరంజీవి, మోహన్ బాబు, నాగబాబు, విజయ్ దేవరకొండ లాంటి అతిథులు రాబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. అన్స్టాపబుల్ షో కోసం బాలయ్య భారీ పారితోషికమే తీసుకుంటున్నాడు. ఒక్కో ఎపిసోడ్కు దాదాపు 50 లక్షల వరకు అందుకుంటున్నాడు ఈయన.