టాలీవుడ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా కొనసాగుతూ.. రాజకీయాల్లో ప్రవేశించి కేవలం 9 నెలల వ్యవధిలో ముఖ్యమంత్రి అయి రికార్డు క్రియేట్ చేసారు ఎన్టీఆర్. ఇక అన్నగారి నట వారసుడిగా సినీ ఇండస్ట్రీలో బాలకృష్ణ తండ్రి తగ్గ తనయుడిగా అగ్ర హీరోగా రాణిస్తున్నారు. అంతేకాదు ఒక నట వారసుడిగా అడుగుపెట్టి గత 46 ఏళ్లుగా హీరోగానే కొనసాగుతున్న ఏకైక హీరోగా బాలయ్య రికార్డు నెలకొల్పారు. ప్రపంచ సినీ చరిత్రలో ఒక నట వారసుడు ఇన్నేళ్లుగా హీరోగా కొనసాగిన వాళ్లు ఎవరులేరు. (Twitter/Photo)
1974లో తండ్రి ఎన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘తాతమ్మ కల’ సినిమాతో బాలకృష్ణ నటుడిగా అరంగేట్రంచేసారు. ఈ సినిమాలో ‘తాతమ్మ కల’ ను నెరవేర్చే ముని మనవడి పాత్రలో బాలయ్య అప్పట్లోనే అద్భుత నటన కనబరిచారు. తండ్రి ఎన్టీఆర్ కాంబినేషన్లో బాలయ్యకు ఇది ఫస్ట్ మూవీ. ఈ చిత్రంలో ఎన్టీఆర్ మరో తనయుడు హరికృష్ణ కూడా నటించారు. (Twitter/Photo)
తండ్రి నందమూరి తారక రామారావుతో తనయడు నందమూరి బాలకృష్ణ కాంబినేషన్లో వచ్చిన ఆరో చిత్రం ‘శ్రీ మద్విరాట పర్వము’. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర పర్వాలేదనిపించింది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ శ్రీకృష్ణ,అర్జున, దుర్యోధన, కీచకుడు,బృహన్నలగా ఐదు పాత్రలు పోషించారు. మరోవైపు బాలయ్య ఈ చిత్రంలో మరోసారి అభిమన్యుడు పాత్రలో నటించడం విశేషం. (Youtube/Photo)
నందమూరి తారక రామారావు జీవతాన్ని ఒకే సినిమాగా తీయకుండా.. రెండు పార్టులగా తెరకెక్కించడం. అందులో సినీ జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సాఫీగా సాగడం. సావిత్రి జీవితంలా ఎలాంటి ఆటుపోట్లు లేకపోవడం వంటివి ఈ సినిమాకు ప్రతికూలంగా మారాయి. మరోవైపు మొదటి పార్ట్ ఎఫెక్ట్ రెండో పార్ట్ ఎన్టీఆర్ మహానాయకుడు పై పడింది. అందులో బయోపిక్ అని చెప్పి మొత్తం జీవితాన్ని కాకుండా.. ఎన్టీఆర్ జీవితంలోని లక్ష్మీ పార్వతి కోణాన్ని చూపించకపోవడం వంటివి ఈ సినిమాకు ప్రతికూలంగా మారాయి. (Twitter/Photo)
‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ సినిమా హిందీ వెర్షన్ను డైరెక్ట్ చేసిన ఎన్టీఆర్. ఆల్రెడీ తెలుగులో ఈ సినిమా ఫ్లాప్ కావడంతో ఈ చిత్రం పూర్తైయిన ఎన్టీఆర్ హిందీలో విడుదల చేయలేదు. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ భరతుడి పాత్రలో నటించడం విశేషం. ఒకవేళ విడుదలై ఉంటే.. ఒకవేళ విడుదలై ఉంటే ఒకే చిత్రంలో మూడు తరాలు హీరోలు నటించిన రికార్డు నందమూరి ఫ్యామిలీకి దక్కేది . (Youtube/Credit)