మహేష్ ఇప్పుడు లిప్ లాక్స్ వద్దు.. ముద్దు సీన్స్‌పై నమ్రత షాకింగ్ రియాక్షన్..
మహేష్ ఇప్పుడు లిప్ లాక్స్ వద్దు.. ముద్దు సీన్స్‌పై నమ్రత షాకింగ్ రియాక్షన్..
Mahesh Babu: తెలుగు ఇండస్ట్రీలోనే కాదు ఇప్పుడు అన్ని ఇండస్ట్రీలలో కూడా లిప్ లాక్ సన్నివేశాలు చాలా కామన్ అయిపోయాయి. మాటల్లో చెప్పలేని చాలా భావాలను ఒక్క ముద్దులో..
తెలుగు ఇండస్ట్రీలోనే కాదు ఇప్పుడు అన్ని ఇండస్ట్రీలలో కూడా లిప్ లాక్ సన్నివేశాలు చాలా కామన్ అయిపోయాయి. మాటల్లో చెప్పలేని చాలా భావాలను ఒక్క ముద్దులో పలికిస్తున్నారు దర్శక నిర్మాతలు.
2/ 8
అందుకే హీరో హీరోయిన్లు కూడా లిప్ లాక్ సన్నివేశాలపై మనసు పడుతున్నారు. పైగా అన్నిచోట్లా కూడా కామన్ అయిపోయిన ఈ సీన్స్ గురించి చర్చలు కూడా జరగడం లేదు.
3/ 8
మహేష్ బాబు కూడా లిప్ లాక్ సీన్స్ గురించి గతంలోనే ఓపెన్ అయ్యాడు. తన ముద్దు సీన్స్ నేషనల్ ఇష్యూ కాదని.. అదేం పెద్ద విషయం కూడా కాదని చురకలు అంటించాడు సూపర్ స్టార్.
4/ 8
ఈయన కూడా గతంలో సమంత, కాజల్, కృతి సనన్ లాంటి హీరోయిన్స్‌తో లిప్ లాక్ సీన్స్ చేసాడు. అయితే ఇప్పుడున్న పరిస్థితులు మాత్రం వేరు.
5/ 8
కరోనా విజృంభిస్తున్న సమయంలో భౌతిక దూరం తప్పనిసరిగా మారిపోయింది. ఇప్పుడు షూటింగ్స్ చేసినా కూడా రొమాంటిక్ సన్నివేశాల విషయంలో జాగ్రత్తలు కంపల్సరీ. (Credit: YouTube)
6/ 8
ఇలాంటి సమయంలో చాలా మంది హీరో హీరోయిన్లు అసలు షూటింగ్‌కు కూడా రావడం లేదు. ఈ క్రమంలోనే మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాలో కూడా దర్శకుడు పరశురామ్ చెప్పిన కొన్ని సీన్స్ గురించి నమ్రత షాకింగ్ రియాక్షన్ ఇచ్చిందని తెలుస్తుంది.
7/ 8
ఈ సినిమాలో రొమాంటిక్ సీన్స్ విషయంతో పాటు లిప్ లాక్ సీన్స్ విషయంలో మహేష్ బాబు జాగ్రత్తలు తీసుకుంటున్నాడని.. ముఖ్యంగా నమ్రత ఇలాంటి సీన్స్ అసలు చేయొద్దని చెప్పినట్లు ప్రచారం జరుగుతుంది.
8/ 8
రొమాంటిక్ సీన్స్ చేసినా పర్లేదు కానీ లిప్ లాక్ లాంటి సీన్స్ ఉంటే మాత్రం నో చెప్పిందని తెలుస్తుంది. డిసెంబర్ నుంచి సర్కారు వారి పాట షూటింగ్ మొదలు కానుంది. వచ్చే ఏడాది సినిమా విడుదల కానుంది.