సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా సర్కారు వారి పాట సినిమాతో పలకరించిన సంగతి తెలిసిందే. మంచి అంచనాల నడుమ వచ్చిన ఈ సినిమా యావరేజ్ హిట్‌గా నిలిచింది. ఇక ఆయన తన తదుపరి చిత్రాన్ని త్రివిక్రమ్‌తో చేయనున్నారు. ఈ సినిమా ఆమధ్య హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఫస్ట్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రం కృష్ణ ఆకస్మిక మరణంతో ఆగిపోయింది. Photo : Twitter
ఇక అది అలా ఉంటే మహేష్ ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే.. మరో వైపు వ్యాపార రంగంలోను దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఇప్పటికే థియేటర్స్, క్లాతింగ్ బిజినెస్‌లో రాణిస్తున్నారు. ఇక తాజాగా రెస్టారెంట్ బిజినెస్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే ఏషియన్ గ్రూప్‌తో కలిసి హైదరాబాదులో రెస్టారెంట్ కూడా ప్రారంభించనున్నారు. Photo : Twitter
.ఈ రెస్టారెంట్‌కు ఏఎన్ అని నామకరణం కూడా చేశారు. ఏ అంటే ఏషియన్స్ అండ్ ఎన్ అంటే నమ్రత. ఈ కొత్త రెస్టారెంట్ బంజారా హిల్స్‌లోని టీఆర్ఎస్ భవనం పక్కన ఉంది. ఈ రెస్టారెంట్ ఈనెల 08న గ్రాండ్‌గా లాంచ్ కానుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన విడుదలైంది. ఇక ఈ రెస్టారెంట్‌కు సంబంధించి ఇటీవల పూజా కార్యక్రమాలునిర్వహించారు. దీనికి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. Photo : Twitter
ఇక మహేష్‌బాబు సినిమాల విషయానికి వస్తే.. త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న SSMB28పై ఇప్పటికే రకరకాలుగా రూమర్స్ వస్తున్నాయి. అందులో భాగంగా మొదట అసలు ఈ సినిమానే ఆగిపోనుందని టాక్ నడిచింది. ఇక ఆ తర్వాత కథలో మహేష్ చాలా మార్పులు చేయాలనీ మహేష్ సూచించారట. దీంతో కథ పూర్తిగా మారిందని అంటున్నారు. ఇక ఈ సినిమా షూట్ త్వరలో రెస్యూమ్ చేయనుందని తెలుస్తోంది. Photo : Instagram
తెలుస్తోన్న సమాచారం ప్రకారం.. హైదరాబాద్ శివార్లలోని ఖాన్పూర్లో షూటింగ్ జరగనుందని తెలిసింది. ఇక కాలి గాయం నుంచి కోలుకున్న పూజా హెగ్డే కూడా ఈ షూట్లో పాల్గోననుందని అంటున్నారు. యాక్షన్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించనున్నాడు. ప్రస్తుతం టీమ్ మ్యూజిక్ సిట్టింగ్స్ కోసం దుబాయ్ వెళ్లినట్లు తెలుస్తోంది. Photo : Instagram
ఇక ఈ సినిమాలో పూజాతో పాటు మరో హీరోయిన్‌కు అవకాశం ఉందని తెలుస్తోంది. అందులో భాగంగా ఓ కొత్త గీత తివారికి అవకాశం వచ్చినట్లు టాక్. తేజ దర్శకత్వంలో దగ్గుబాటి అభిరామ్ హీరోగా వస్తున్న అహింసలో గీతిక తివారి అనే కొత్త అమ్మాయి నటిస్తోంది. ఈ భామకు మహేష్ సినిమాలో అవకాశం వచ్చినట్లు టాక్ నడుస్తోంది. అంతేకాదు ఈ భామకు ఇప్పటికే మరొక రెండు సినిమాల్లో ఛాన్స్ లభించినట్లు తెలుస్తోంది. మొదట ఈ పాత్రలో శ్రీలీలను అనుకున్నారు. అయితే ఆమె సున్నితంగా తిరస్కరించడంతో గీతిక ఈ అవకాశాన్ని దక్కించుకుందని టాక్. చూడాలి మరి ఈ సినిమా గీతిక తివారికి ఏమాత్రం ఉపయోగపడుతుందో.. Photo : Instagram
ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ఆ మధ్య హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఎంతో గ్రాండ్‌గా ప్రారంభం అయ్యింది. అక్కడే ఓ వారం రోజులు షూట్ చేశారు. ఈ ఫస్ట్ షెడ్యూల్లో కొన్ని హై ఆక్టేన్ ఎపిక్ యాక్షన్ సన్నివేశాలను షూట్ చేశారట. ఇక రెండో షెడ్యూల్ త్వరలో మొదలుకానుందని తెలిపారు చిత్ర నిర్మాత నాగవంశీ.. ఈ రెండో షెడ్యూల్ రామోజీ ఫిలిం సిటీలో వేసిన భారీ ప్రత్యేక సెట్లో షూట్ రెస్యూమ్ కానుందని తెలుస్తోంది. ఇక దాదాపుగా ఓ 12 సంవత్సరాల తర్వాత మహేష్ బాబుతో చేస్తున్న ఈ మూవీని త్రివిక్రమ్ అందరి అంచనాలు అందుకునేలా తెరకెక్కిస్తున్నారట. Photo : Twitter
వీటితో పాటు కేవలం దక్షిణాది నాలుగు రాష్ట్రాల డిజిటల్ రైట్స్‌కు 100 కోట్ల వరకు కోట్ చేస్తున్నారట. దీనికి సంబంధించి ప్రముఖ ఓటిటి సంస్థల ప్రతినిధులతో చర్చలు కూడా జరుగుతున్నాయని అంటున్నారు. ఇక హిందీ డబ్బింగ్‌తో పాటు డిజిటల్ రైట్స్ మాత్రం ఓ ముఫై కోట్ల రేంజ్ పలకొచ్చని తెలుస్తోంది. ఇక ఆడియో రైట్స్‌కు ఓ ఐదు కోట్లు డిమాండ్ చేయనున్నారట. Photo : Twitter
థియేటర్ హక్కుల విషయానికి వస్తే నైజాం ఏరియాకే దాదాపుగా ఓ 45 కోట్ల రేంజ్లో కోట్ చేయవచ్చని అంటున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అలవైకుంఠపురములో సినిమా 42 కోట్లు వసూలు చేసింది. ఇక ఆంధ్ర 50 కోట్ల రేంజ్లో, సీడెడ్ 20 కోట్ల రేంజ్ ఉండనుందని సమాచారం. మొత్తంగా 260 నుంచి 280 వరకు బిజినెస్ జరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాల మాట. Photo : Twitter
ఈ సినిమా దాదాపుగా ఐదు భాషాల్లో విడుదలకానున్నట్లు తెలుస్తోంది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషాల్లో ఒకేసారి వస్తున్నట్లు టాక్. ఒక వేళా అదే నిజం అయితే మొదటి మహేష్ ప్యాన్ ఇండియా సినిమా ఇదే అని అనుకోవాలి. ఈ సినిమాకు ‘పార్థు’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది.. ఈ మూవీలో మహేష్‌కి జోడీగా పూజా హెగ్డే నటిస్తున్నారు. థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ మూవీకి మది ఫోటోగ్రఫి అందిస్తున్నారు. Photo : Instagram
మహేష్ బాబుతో పాటు ఈ సినిమాలో మరో యువ హీరో నటిస్తున్నట్లు ఇటీవల టాక్ వచ్చిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా ప్రముఖ తెలుగు నటుడు తరుణ్ నటిస్తాడని అన్నారు. కాగా తరుణ్ తాజాగా క్లారిటీ ఇస్తూ.. తాను ఎటువంటీ సినిమా చేయట్లేదని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో తరుణ్ కాకుండా.. మలయాళీ యువ హీరో రోషన్ మాథ్యూ ఎంపికైనట్లు తెలుస్తోంది. అంతేకాదు రోషన్ ఈ సినిమాలో నెగిటివ్ పాత్రలో కనిపించనున్నారట. రోషన్, ఆలియా భట్ నటించిన డార్లింగ్స్, తాజాగా విడుదలైన కోబ్రా వంటి చిత్రాలలో నటించి మెప్పించారు. Photo : Instagram
ఇక మరోవైపు (Trivikram Srinivas) త్రివిక్రమ్ విషయానికి వస్తే.. ఆయన ఎన్టీఆర్‌తో ‘అరవింద సమేత, అల్లు అర్జున్ తో ‘అల వైకుంఠపురములో’ వంటి వరుస హిట్ చిత్రాలను రూపోందించారు. ఈ సినిమా కూడా హారికా హాసిని బ్యానర్‌పై నిర్మించనున్నారు. హీరోగా మహేష్ బాబుకు (Mahesh Babu) ఇది 28వ చిత్రం. అంకుల్ పాత్రలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నటించబోతున్నాడని ప్రచారం జరుగుతుంది. Photo : Instagram
ఈ కారెక్టర్ త్రివిక్రమ్ విభిన్నంగా డిజైన్ చేస్తున్నాడని.. కచ్చితంగా మహేష్ బాబు, మోహన్ బాబు కాంబినేషన్లో వచ్చే సన్నివేశాలు చాలా బాగుంటాయని నమ్మకంగా చెప్తున్నారు యూనిట్. మోహన్ బాబు నటించబోయే సంగతి త్వరలోనే యూనిట్ నుంచి రాబోతుంది. అంతేకాదు ఈ మూవీలో అలనాటి అగ్ర హీరోయిన్ శోభన కూడా మరో ముఖ్యపాత్రలో నటించబోతున్నట్టు టాక్. Photo : Instagram
Rajamouli-Mahesh : రాజమౌళి, మహేష్ బాబు సినిమా కోసం అభిమానులు ఎన్నో ఏళ్లుగా కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. వీరి కాంబినేషన్లో సినిమా వస్తుందంటూ గత పదేళ్లుగా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం మహేష్ బాబు, త్రివిక్రమ్ మూవీ షూటింగ్లో ఇటీవలే జాయిన్ అయ్యారు. ఈ మూవీ కోసం మహేష్ బాబు సరికొత్తగా మేకోవర్ అయ్యారు. ఈ సినిమా తర్వాత రాజమౌళితో చేయబోయే సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.. Photo : Twitter
ఇక ఈ సినిమాను ఏకకాలంలో తెలుగుతో పాటు ఇంగ్లీష్‌తో షూట్ చేయనున్నారట. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఆర్ ఆర్ ఆర్ తర్వాత రాజమౌళికి హాలీవుడ్లో మంచి పాపులారటీ వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను తెలుగుతో పాటు ఇంగ్లీష్’లో కూడా షూటింగ్ చేస్తారట. ఇక మిగితా భాషాల్లో డబ్ చేస్తారట. దీనికి సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చూడాలి మరి ఈ వార్తల్లో నిజం ఎంతో.. Photo : Twitter
ఇక అది అలా ఉంటే ఈ సినిమాపై మరో ఇంట్రెస్టెంట్ అప్ డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమా గురించి మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆఫ్రికన్ ఫారెస్ట్ నేపథ్యంలో సాగే ఈ అడ్వెంచర్ డ్రామా నిజ జీవిత సంఘటన ఆధారంగా వస్తోందని తెలుస్తోంది. ఈ విషయాన్ని రాజమౌళి తండ్రి ఈ సినిమా రచయిత విజయేంద్ర ప్రసాద్ స్వయంగా ఓ బాలీవుడ్ మీడియాతో తెలిపినట్లు టాక్. . Photo : Twitter
మరోవైపు ఈ సినిమా కోసం రాజమౌళి హాలీవుడ్ లాస్ ఏంజెల్స్కకు సంబంధించిన ప్రముఖ ఏజెన్సీ CAA (క్రియేటివ్ ఆర్టిస్ట్స్ ఏజెన్సీ)తో ఒప్పందం కుదుర్చున్నారు. ఈ సంస్థ కాస్టింగ్‌తో పాటు, బ్రాండింగ్, మార్కెటింగ్ వంటి సేవలను అందిస్తుంది. ఇలాంటి సంస్థతో రాజమౌళి డీల్ అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. దీంతో రాజమౌళి చేసే నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో మరిన్ని అంచానాలు ఏర్పడుతున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్గా హిందీ నటి దీపికా పదుకొనె ఫైనల్ అయ్యినట్టు తెలుస్తోంది. ఆమె ఇప్పటికే xXx: ది రిటర్న్ ఆఫ్ క్సాండర్ కేజ్ అనే ఓ హాలీవుడ్ సినిమాలో నటించడంతో కొంత ప్లస్ అవుతుందని.. ఆమెను చిత్రబృందం ఓకే చేసినట్లు తెలుస్తోంది. . Photo : Twitter
ఇక ఈ సినిమా ఆఫ్రికా ఖండం నేపథ్యంలో ఒక భారీ సాహసంతో కూడిన థ్రిల్లర్ మూవీని తెరకెక్కించబోతున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే దీనిపై దర్శకుడు రాజమౌళి ఈ సినిమా నేపథ్యాన్ని వెల్లడించారు. మహేష్ బాబుతో చేయబోయే సినిమాను లోకం చుట్టిన వీరుడు నేపథ్యంలో భారీ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్‌గా ప్లాన్ చేస్తున్నట్టు చెప్పారు. . Photo : Twitter
వచ్చే యేడాది సమ్మర్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయనున్నట్టు సమాచారం. 2024 సమ్మర్ కానుకగా ఈ సినిమా విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు. ప్రస్తుతం రాజమౌళి తన పూర్తి సమయాన్ని మహేష్ బాబుతో చేయబోయే సినిమా కోసమే కేటాయించనున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కథ విషయమై తన తండ్రి విజయేంద్ర ప్రసాద్‌తో డిస్కషన్స్ పూర్తి చేసి ఒక రూపు తీసుకొచ్చారు. Photo : Twitter
రాజమౌళి ఇపుడు మహేష్ బాబుతో తెరకెక్కించబోయే సినిమాను కూడా మల్టీస్టారర్‌గా ప్లాన్ చేస్తున్నట్టు టాక్ నడిచింది. ఈ సినిమాలో తమిళ హీరో విక్రమ్ ముఖ్యపాత్రలో నటించబోతున్నట్టు ప్రచారం జరగుతోంది. మరోవైపు ఈ సినిమా ఆ పాత్రను బాలయ్యతో చేయించాలనే ఆలోచనలో ఉన్నట్టు వార్తలు వచ్చాయి. అయితే అదంతా ఏమిలేదని తెలుస్తోంది. Photo : Twitter
రాజమౌళితో సినిమా చేస్తే అది ఆయన కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ అవుతుందని మహేష్ బాబు అభిమానులు కూడా వేచి చూస్తున్నారు. సీనియర్ నిర్మాత కేఎల్ నారాయణ ఈ సినిమాను నిర్మించబోతున్నాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు రాజమౌళి మామూలు సినిమాలు చేయడం మానేసాడు. ఇప్పటికే విజయేంద్ర ప్రసాద్ మహేష్ బాబుతో జక్కన్నతో చేయబోయే సినిమాకు సంబంధించిన కథను వండివార్చే పనిలో ఉన్నారు. Photo : Twitter
అంతేకాదు రాజమౌళి, మహేష్ బాబు కాంబోలో తెరకెక్కే చిత్రాన్ని హాలీవుడ్ (Hollywood) మూవీ ‘ఇండియానా జోన్స్ తరహాలో ఆఫ్రికన్ అడ్వెంచర్ థ్రిల్లర్‌గా భారీ ఎత్తున తెరకెక్కించబోతున్నట్టు జక్కన్న తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించిన సంగతి తెలిసిందే కదా. అంతేకాదు దక్షిణాఫ్రికాకు చెందిన విల్బర్ స్మిత్ పెద్ద అభిమానులం అంటూ చెప్పారు. ఆయన రాసిన కథ స్పూర్తితో ఈ సినిమాను తెరకెక్కించాలనుకున్నట్టు సమాచారం. తాజాగా ఈ చిత్రాన్ని గ్లోబల్ భారీ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్‌గా రూపొందించబోతున్నట్టు జక్కన్న చెప్పడంతో ఈ మూవీపై అంచనాలు మాములుగా లేవు. (Twitter/Photo)
ఇపుడు రాజమౌళి, మహేష్ బాబు సినిమా కూడా ప్యాన్ ఇండియా లెవల్లో కాకుండా ప్యాన్ వరల్డ్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నాడు. ఇక రాజమౌళి కూడా తాను ఏ సినిమా తెరకెక్కించినా.. ముందుగానే ఆ సినిమా స్టోరీ ఏంటనేది ముందుగానే చెప్పేస్తుంటారు. ఒక విధంగా కథ చెప్పి తన సినిమాలపై హైప్ క్రియేట్ చేయడం రాజమౌళికి ముందు నుంచే ఓ అలవాటు ఉంది. మొత్తంగా రాజమౌళి.. మహేష్ బాబు కాంబినేషన్లో అడ్వెంచర్ తరహా చిత్రాన్ని తెరకెక్కిస్తాడనేది ఇప్పటి నుంచే అభిమానుల్లో అంచనాలు మొదలైయ్యాయి. తాజాగా ఆర్ఆర్ఆర్ మూవీతో రాజమౌళి గ్లోబల్ లెవల్ దర్శకుల దృష్టిలో పడ్డారు. వాళ్లందరు రాజమౌళి డైరెక్షన్‌ను మెచ్చుకున్నసంగతి తెలిసిందే కదా. (Twitter/Photo)