హీరోయిన్ నమిత తల్లి కాబోతుంది.. ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్ వేదికగా ప్రకటించింది నమిత.. బేబి బంప్‌తో ఉన్న ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.. 'మాతృత్వం.. నా జీవితంతో కొత్త అధ్యాయం మొదలైంది. నాలో ఏదో మార్పు మొదలైందని అంటూ ఎమోషనల్ పోస్టు చేసింది నమిత. 2017లో నమిత వ్యాపారి వీరేంద్ర చౌదరిని వివాహం చేసుకుంది.
తెలుగు,తమిళ్ సినిమాల్లో నటించి మెప్పించిన హీరోయిన్ నమిత. ప్రముఖ హీరోలందరితో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోయింది ఈ బొద్దు గుమ్మ.
2/ 12
ఎక్స్ పోజింగ్ చేస్తూ… కుర్రకారు మతులు చెడగొట్టిన ఈ ముద్దు గుమ్మ 2017లో తన ప్రియుడైన వీరేంద్రను పెళ్లి చేసుకుని సెటిల్ అయింది. పెళ్లి తర్వాత అంతగా కనిపించకపోయినా ఈ అమ్మడుకి ప్రేక్షకుల్లో మాత్రం ఆదరణ తగ్గలేదు.
3/ 12
ఈ రోజు నమిత పుట్టినరోజు. ఈ సందర్భంగాతన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. తాను గర్భవతి అని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఈ మేరకు బేబీ బంప్ ఫోటోను పోస్ట్ చేసింది.
4/ 12
బేబీ బంప్ తో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. నా లైఫ్ లో కొత్త అధ్యాయం మొదలైంది. నేను ఇన్నాళ్లు కోరుకున్నది నీ గురించే నీకోసమే ప్రార్థించ అంటూ పుట్టబోయే బిడ్డ గురించి రాసి వచ్చింది నమిత.
5/ 12
బేబీ బంప్ తో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. నా లైఫ్ లో కొత్త అధ్యాయం మొదలైంది. నేను ఇన్నాళ్లు కోరుకున్నది నీ గురించే నీకోసమే ప్రార్థించ అంటూ పుట్టబోయే బిడ్డ గురించి రాసి వచ్చింది నమిత.
6/ 12
సొంతం సినిమాతో టాలీవుడ్లోకి అడుగుపెట్టిన నమిత.. ఆ తర్వాత విక్టరీ వెంకటేష్‌తో జెమిని, రవితేజతో ఒకరాజు-ఒకరాణి, ప్రభాస్‌తో బిల్లా, బాలయ్యతో సింహా వంటి సినిమాల్లో నటించింది. అయితే తెలుగులో కంటే తమిళంలో నమిత ఎక్కువగా నటించింది.
7/ 12
తమిళంలో అయితే అభిమానులు ఆమెకు గుడి కూడా కట్టేశారు. కొంచెం నెమ్మదించాక 2017లో వ్యాపారి వీరేంద్ర చౌదరితో నమిత వివాహం జరిగింది. వివాహం చేసుకున్న తర్వాత కూడా ఆమె సినిమాల్లో నటిస్తూనే ఉంది.
8/ 12
కు చెందిన ఈ ముద్దుగుమ్మ తెలుగులో సొంతం, జెమిని, నాయకుడు, బిల్లా, సింహ చిత్రాల్లో నటించింది. అయితే 41 సంవత్సరాలలో నమిత ప్రెగ్నెంట్ కావడం గమనార్హం.
9/ 12
పెళ్లాయ్యాక కూడా నమితపైఅనేక రకాల రూమర్స్ వచ్చాయి. అయితే వాటిని పెద్దగా ఈ జంట పట్టించుకోలేదు. మ్యారేజ్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తూ వచ్చారు.
10/ 12
తమిళ ఇండస్ట్రీలో నమితకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. చాలామంది ఆమెను అమితంగా ఆరాధిస్తారు. తమిళ్ అభిమానులు నమితకు గుడి కూడా కట్టించారు.
11/ 12
మరోవైపు నమిత తల్లి కాబోతుండటంతో ఆమె అభిమానులు విషెస్ చెబుతున్నారు. చాలా అద్భుతమైన న్యూస్ చెప్పారు. శుభాకాంక్షలు అంటూ నెటిజన్స్ విషెస్ చెబుతున్నారు.
12/ 12
ఇవాళ నమిత బర్త్ డే కావడంతో హ్యాపీబర్త్ డే అంటూ.. విషెస్ కూడా చెబుతున్నారు. జూనియర్ కుట్టి కోసం వెయిటింగ్ అంటూ.. అభిమానులు నమితకు శుభాకాంక్షలు చెబుతున్నారు.